Site icon NTV Telugu

Bajaj vs TVS: టీవీఎస్‌ను దాటేసిన బజాజ్‌.. అగ్రస్థానంలో ఓలా!

Bajaj Chetak

Bajaj Chetak

విద్యుత్‌ ద్విచక్ర వాహన రంగంలో కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈవీల విక్రయాల్లో దిగ్గజ కంపెనీలు టీవీఎస్‌, బజాజ్‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. విక్రయాల్లో ఇన్నాళ్లు టీవీఎస్‌ రెండో స్థానంలో ఉండగా.. సెప్టెంబర్‌లో బజాజ్‌ చేతక్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది. గత నెలలో ఈవీల విక్రయాల్లో ఓలా అగ్రస్థానంలో ఉండగా.. ఏథర్‌, హీరో మోటోకార్ప్‌ టాప్ 5లో ఉన్నాయి.

Also Red: Shardul Thakur: జట్టు కోసం 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్‌ చేశాడు.. చివరికి ఆసుపత్రిలో చేరాడు!

సెప్టెంబర్‌ నెలలో ఓలా 23,965 యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఓలా అగ్రస్థానంలో కొనసాగుతున్నా.. మార్కెట్‌ వాటా మాత్రం కాస్త క్షీణించింది. మార్కెట్‌ వాటా 27 శాతానికి పడిపోయింది. బజాజ్‌ ఆటో 18,933 చేతక్‌లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. టీవీఎస్‌ 17,865 యూనిట్ల ఐక్యూబ్‌లను విక్రయించి మూడో స్థానంలో ఉంది. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లతో స్కూటర్లను అందించడమే ఓలా అగ్రస్థానంలో కొనసాగడానికి కారణం. సర్వీసు సెంటర్ల విషయంలో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రతికూలంగా మారింది.

Exit mobile version