అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న బైరి నరేష్ నేడు వరంగల్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ, అయ్యప్ప స్వామి పుట్టుకను అవమానిస్తూ, అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు బైరి నరేష్. దీంతో అయ్యప్ప స్వాములతో పాటు పలువురు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. నడిరోడ్డుపై బైరి నరేష్ అనుచరుడు శంకర్‌పై అయ్యప్ప స్వాములతో పాటు పలువురు దాడి చేశారు. అయితే.. నరేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు చేశారు.
Also Read : NBK108: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!
అంతేకాకుండా.. బైరి నరేష్‌పై పలు చోట్ల కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పటి నుంచి బైరి నరేష్ కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నేడు వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడికి కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరుపర్చడంతో.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బైరి నరేష్‌ను పరిగి సబ్ జైలుకు తరలించారు. జైలుకు తరలించే క్రమంలో పోలీస్ వాహనాలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు జైలు వద్దకు భారీగా తరలిరావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read : Talasani Srinivas : మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది
Bairi Naresh : బైరి నరేష్‌కు 14 రోజుల రిమాండ్

Bairi Naresh