NTV Telugu Site icon

Bagheera : ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “బఘీర”

Bagheera Review

Bagheera Review

Bagheera : శ్రీ మురళి హీరోగా చేసిన తాజా చిత్రం బఘీర. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కథ అందించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల పాటు సాగినా 127 రోజుల్లో పూర్తి చేశారట మేకర్స్. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం 5 భారీ సెట్లు నిర్మించారు నిర్మాతలు. ఒక్కో సెట్ నిర్మాణానికి 60 రోజులు పట్టింది. కేవలం ఫైట్ సీక్వెన్స్‌ల కోసం 55 రోజులు సమయం కేటాయించారు. చిత్ర హీరో శ్రీ మురళి ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు జిమ్ శిక్షణ పొంది చాలా కష్టపడి ఈ సినిమా తీశారు.. అంతే కాకుండా చిత్ర షూటింగ్ సమయంలో హీరోకి గాయాలయ్యాయి, దీని వలన షూటింగ్ 4 నెలలు ఆగిపోయింది. 90శాతం యాక్షన్ సన్నివేశాలను హీరో ఎటువంటి డూప్ లేకుండా నటించాడు. ఇంత కష్టపడి తీసినా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిలువ లేకపోయింది.

Read Also:International Cultural Festival: నేటి నుంచి లోక్ మంథన్.. హాజరుకానున్న రాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు

ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు సూరి తెరకెక్కించిన “బఘీర”. ఒక సెమీ సూపర్ హీరో కథలా దీపావళి కానుకగా అయితే థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. ఇంకా నెల కూడా పూర్తి కాకుండానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని వారు పాన్ సౌత్ భాషలు సహా తులు భాషలో కూడా నేటి నుంచి తీసుకొస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. కానీ ఇపుడు ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రం కేవలం తెలుగు సహా కన్నడ భాషల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చేసింది. మిగతా భాషల్లో త్వరలో యాడ్ చేస్తామంటున్నామని సదరు సంస్థ చెబుతోంది. మరి ఈ సినిమా చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది చూసేయవచ్చు.

Read Also:Parliament Winter session: ‘వక్ఫ్‌ సవరణ బిల్లు-2024’ పై పార్లమెంట్‌లో చర్చ తేదీ ఖరారు.. ఎప్పుడంటే?