Bagheera : ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “బఘీర”
- నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన బఘీర
- విడుదలైన నెల రోజుల్లోనే వచ్చేసిన సినిమా
- సెమీ సూపర్ హీరోగా తెరకెక్కిన మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bagheera : శ్రీ మురళి హీరోగా చేసిన తాజా చిత్రం బఘీర. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కథ అందించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల పాటు సాగినా 127 రోజుల్లో పూర్తి చేశారట మేకర్స్. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం 5 భారీ సెట్లు నిర్మించారు నిర్మాతలు. ఒక్కో సెట్ నిర్మాణానికి 60 రోజులు పట్టింది. కేవలం ఫైట్ సీక్వెన్స్‌ల కోసం 55 రోజులు సమయం కేటాయించారు. చిత్ర హీరో శ్రీ మురళి ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు జిమ్ శిక్షణ పొంది చాలా కష్టపడి ఈ సినిమా తీశారు.. అంతే కాకుండా చిత్ర షూటింగ్ సమయంలో హీరోకి గాయాలయ్యాయి, దీని వలన షూటింగ్ 4 నెలలు ఆగిపోయింది. 90శాతం యాక్షన్ సన్నివేశాలను హీరో ఎటువంటి డూప్ లేకుండా నటించాడు. ఇంత కష్టపడి తీసినా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిలువ లేకపోయింది.
Also Read
- IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
- Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
- Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ ఖరారు
- Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్‌లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు సూరి తెరకెక్కించిన “బఘీర”. ఒక సెమీ సూపర్ హీరో కథలా దీపావళి కానుకగా అయితే థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. ఇంకా నెల కూడా పూర్తి కాకుండానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని వారు పాన్ సౌత్ భాషలు సహా తులు భాషలో కూడా నేటి నుంచి తీసుకొస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. కానీ ఇపుడు ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రం కేవలం తెలుగు సహా కన్నడ భాషల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చేసింది. మిగతా భాషల్లో త్వరలో యాడ్ చేస్తామంటున్నామని సదరు సంస్థ చెబుతోంది. మరి ఈ సినిమా చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది చూసేయవచ్చు.
Read Also:Parliament Winter session: ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’ పై పార్లమెంట్‌లో చర్చ తేదీ ఖరారు.. ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణం టీమ్?
-
Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
-
Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!