NTV Telugu Site icon

CharDham Yatra : విరిగిపడిన కొండచరియలు.. పరుగు తీసిన యాత్రికులు

New Project (18)

New Project (18)

CharDham Yatra :ఈ ఏడాది బద్రీనాథ్ యాత్రికులకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. వాతావరణం సహకరించకపోవడంతో యాత్రలో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలే చార్ ధామ్ యాత్ర సాహసంతో కూడుకున్నది. అందునా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే బద్రీనాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడుతున్న భయానక వీడియో వైరల్‌గా మారింది. రహదారిపై కొండచరియలు విరిగి పడుతుండటంతో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బద్రీనాథ్ హైవేపై హెలాంగ్‌లో కొండపై నుంచి శిథిలాలు భారీగా పండటంతో రహదారి మూసుకుపోయింది. దీంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్‌కు వెళ్లే యాత్రికులు వారివారి ప్రాంతాల్లో వేచి ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గౌచర్, కర్ణ ప్రయాగ్, లంగాసు ప్రాంతాల్లో రహదారిపై వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
Read Also: AP Bhavan: కొలిక్కి ఏపీ భవన్‌ విభజన.. ఏపీకి 12.09, తెలంగాణకు 7.64 ఎకరాలు!

బద్రీనాథ్ జాతీయ రహదారిపై హెలాంగ్ వద్దకు వాహనాల ద్వారా యాత్రికులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అదే సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదాన్ని పసిగట్టి యాత్రికులు తమ వాహనాలను నిలిపివేశారు. కొండచరియలు భారీగా పడుతుండడంతో వాహనాల్లోని యాత్రికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రహదారిపై మట్టిదిబ్బలను తొలగించిన తరువాత యాత్రికులను యాత్రకు అనుమతిస్తామని, అప్పటి వరకు సురక్షిత ప్రాంతాల్లో వేచి ఉండాలని కర్ణ ప్రయాగ్ సీఓ అమిత్ కుమార్ తెలిపారు.

Read Also: Tamilnadu : పోలీసుల దారుణం..17ఏళ్ల యువకుడికి చిత్రహింసలు