NTV Telugu Site icon

Badi Bata: సరికొత్త ప్రచారం దిశగా బడిబాట..

Badi Bata

Badi Bata

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నటి నుండి బడిబాట కార్యక్రమం మొదలయింది. జూన్ 19 వరకు కొనసాగనున్న ఈ బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, ఆపై అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించబోతున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సరికొత్త ప్రచారం షురూ చేయనున్నారు అధికారులు. ఈ ప్రచారాన్ని అమ్మ కమిటీలకే బాగోగులు, బాధ్యతలను అప్పగించారు. ప్రైవేటు మోజు నుంచి తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేయనున్నారు.

Top Headlines @ 5PM : టాప్‌ న్యూస్

ఇక ఈ కార్యక్రమంలో అనేక అంశాలను అధికారులు ప్రచారం చేయనున్నారు. అవేమంటే.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావడం., విద్యార్థుల నమోదు శాతం పెంచటం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం చేపట్టింది. ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని తల్లిదండ్రులను చైతన్యవంతులను చేస్తోంది. ప్రైవేటు స్కూల్స్ లో చేరితే రూ.50 వేల నుంచి రూ 1.50 లక్షల వరకు ఖర్చవుతుందని.., ఇప్పుడు ఆదా చేసే డబ్బును మీ పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేయమంటూ సరికొత్తగా ప్రచారం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రైవేటు పై మోజు తగ్గించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించింది.

రాష్ట్రమంతటా ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి అధ్వర్యంలో అన్ని పాఠశాలలను కొత్త హంగులతో తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలో విద్యాబోధనతోపాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఒక జత షూస్‌ను ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 6వ తేదీ నుంచి మొదలైన బడిబాట ఈనెల 19వ తేదీ వరకు చేపడుతారు. బడీడు పిల్లలను, బడిమానేసిన విద్యారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అమ్మ ఆదర్శ కమిటీలతోపాటు, విద్యా శాఖాధికారులు, హెడ్మాస్టర్లు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఇదే బడిబాట సందర్భంగా.. ప్రైవేటు స్కూళ్లపై మోజు తగ్గించి.. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవానికి కృషి చేసేలా విస్తృత ప్రచారం చేపట్టాలని, తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నం జరగాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

EVM: ‘‘ వాటికి ఇప్పుడు విశ్రాంతినివ్వండి.. వచ్చే ఎన్నికల్లో తిట్టండి’’..ఈవీఎంలను నిందించడంపై సీఈసీ సెటైర్లు..

పాఠశాలల బాగోగులు, బాధ్యతలను అమ్మ కమిటీలకు అప్పగించటం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 26,823 పాఠశాలల్లో 20,680 చోట్ల ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశారు. 17,729 పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ ఈ కమిటీలకు అప్పగించారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతుల పనులన్నింటినీ ప్రభుత్వం ఈ సారి వేసవిలోనే మొదలు పెట్టింది. ఈ పనులకు రూ.667.25 కోట్లు కేటాయించింది. అందులో ఇప్పటికే రూ.147 కోట్లు కమిటీలకు అడ్వాన్సుగా కూడా చెల్లించింది.