MLC Anantha Babu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం విదితమే.. అయితే, ఈ రోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఎమ్మెల్సీ అనంతబాబును అడ్డుకున్నారు స్థానికులు, దళితులు.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మవరంలోని బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు అనంతబాబు.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి పూనుకున్నారు.. కానీ, ఒక దళితుడిని చంపి ఎస్సీ కాలనీకి వచ్చి ఓట్లు అడగడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు స్థానికులు.. అనంతబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. అనంతబాబు పూలమాల వేయడంతో బీఆర్ అంబేద్కర్ విగ్రహం అపవిత్రమైంది అంటూ.. ఆ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు దళితులు.. కాగా, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారావు కి మద్దతుగా ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు అనంతబాబు.. ఓ దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తక్షణమే అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.. ఇక, ధర్మవరంలో నిరసన వ్యక్తం కావడంతో.. అక్కడి నుంచి బైక్ పై వెనక్కి తిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్సీ అనంతబాబు.
Read Also: Alia Bhatt : అలియాభట్ మెడలో మెరిస్తున్న ఈ నెక్లేస్ ధర తెలిస్తే షాక్ అవుతారు..