Site icon NTV Telugu

Smriti Irani: అమేథీలో ఘోర పరాజయం.. స్పందించిన స్మృతి ఇరానీ

Smrithi

Smrithi

ఉత్తర ప్రదేశ్ అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మపై ఓడిపోయారు. మొద‌టి రౌండ్ నుంచి ఇక్కడ ఆమె వెనుకంజ‌లోనే కొనసాగారు. గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథిలో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత‌ రాహుల్ గాంధీని ఓడించారు. దీంతో ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయుడైన కిశోరీ లాల్ శర్మను అమేథీ నుంచి బరిలోకి దింపింది. ఇక‌ అమేథీ నుంచి గెలుపు ఖాయమని మొదటి నుంచీ ధీమాగా ఉన్న స్మృతి ఇరానీకి ఈసారి భంగ‌పాటు తప్పలేదు.

Read Also: Narendra Modi: హ్యాట్రిక్ విజయం సాధించిన ప్రధాని మోడి.. కాకపోతే మెజారిటీ..

స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ 1 లక్ష 67 వేల 196 ఓట్ల తేడాతో గెలుపొందారు. శర్మకు మొత్తం 5 లక్షల 39 వేల 228 ఓట్లు వచ్చాయి. కాగా.. స్మృతి ఇరానీకి 3 లక్షల 72 వేల 32 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో.. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, “ఈ రోజు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే రోజు, గెలిచిన వారికి అభినందనలు తెలిపే రోజు.” అని అన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి గ్రామానికి వెళ్లి కార్యకర్తలతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Read Also: KTR: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతి పెద్ద గౌరవం..

మరోవైపు.. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కెఎల్ శర్మ విజయంపై ట్వీట్ చేశారు. కేఎల్ శర్మతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. “కిషోరీ భయ్యా, నాకు ఎప్పుడూ సందేహం లేదు, మీరు గెలుస్తారని నేను మొదటి నుండి అనుకున్నాను. మీకు మరియు నా ప్రియమైన అమేథీ సోదర సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు!” తెలిపారు.

Exit mobile version