Site icon NTV Telugu

Bose Venkat: నటుడి ఇంట తీవ్ర విషాదం.. హార్ట్ ఎటాక్ తో సోదరి మృతదేహం మీదనే కన్నుమూత!

Tragedy At Bose Venkat Home

Tragedy At Bose Venkat Home

Back to back Tragedies at Bose venkat home: ఈ మధ్య కాలంలో ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండానే గుండె ఆగిపోయి యుక్త వయసు వారు కూడా ప్రాణాలు కోల్పోతుండటం అందరినీ టెన్షన్ పెడుతోంది. పదేళ్ళ బాలుడు కూడా ఈ మహమ్మారికి బలయ్యాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ గుండె పోటు తమిళ నటుడి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ఇంకెవరో కాదు తమిళ నటుడు బోస్ వెంకట్. తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ప్రముఖ నటుడుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వ్యవహరిస్తున్న ఆయన ఈ మధ్యనే సినిమా దర్శకుడిగా మారారు. 2020లో ఆయన చేసిన తొలి చిత్రం ‘కన్నీ మాదం’ మంచి టాక్ కూడా తెచ్చుకుంది. ఇక ‘మెట్టి ఓలి’ సీరియల్ ద్వారా బ్రేక్‌ సంపాదించిన బోస్ ఇప్పుడు తమిళ బుల్లితెర నటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
Kerala Crime Files Review: కేరళ క్రైమ్ ఫైల్స్ రివ్యూ
అసలు విషయం ఏమిటంటే నిన్న, బోస్ వెంకట్ సోదరి వలర్మతి చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలో వారి కుటుంబం శోకసంద్రంలో ఉండగా, తన సోదరి మరణాన్ని చూసి తట్టుకోలేక వెంకట్ సోదరుడు రంగనాథన్ కూడా గుండెపోటుకు గురయ్యాడు. ఆ వెంటనే ఆమె మృతదేహంపై కుప్పకూలి మరణించాడు. తమ సోదరి అంత్యక్రియల సమయంలో రంగనాథన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న సమయంలో ఇది జరిగిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఇక వీరి అంత్యక్రియలు అరంతంగిలో నిర్వహించనున్నట్లు సమాచారం. రెండు వరుస మరణాలు బోస్ వెంకట్ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. ఈ ఘటన తమిళ సినీ, టీవీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ వర్గాల వారు బోస్ వెంకట్ అభిమానులు ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Exit mobile version