Bose Venkat: నటుడి ఇంట తీవ్ర విషాదం.. హార్ట్ ఎటాక్ తో సోదరి మృతదేహం మీదనే కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Back to back Tragedies at Bose venkat home: ఈ మధ్య కాలంలో ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండానే గుండె ఆగిపోయి యుక్త వయసు వారు కూడా ప్రాణాలు కోల్పోతుండటం అందరినీ టెన్షన్ పెడుతోంది. పదేళ్ళ బాలుడు కూడా ఈ మహమ్మారికి బలయ్యాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ గుండె పోటు తమిళ నటుడి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ఇంకెవరో కాదు తమిళ నటుడు బోస్ వెంకట్. తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ప్రముఖ నటుడుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వ్యవహరిస్తున్న ఆయన ఈ మధ్యనే సినిమా దర్శకుడిగా మారారు. 2020లో ఆయన చేసిన తొలి చిత్రం ‘కన్నీ మాదం’ మంచి టాక్ కూడా తెచ్చుకుంది. ఇక ‘మెట్టి ఓలి’ సీరియల్ ద్వారా బ్రేక్ సంపాదించిన బోస్ ఇప్పుడు తమిళ బుల్లితెర నటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
Kerala Crime Files Review: కేరళ క్రైమ్ ఫైల్స్ రివ్యూ
అసలు విషయం ఏమిటంటే నిన్న, బోస్ వెంకట్ సోదరి వలర్మతి చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలో వారి కుటుంబం శోకసంద్రంలో ఉండగా, తన సోదరి మరణాన్ని చూసి తట్టుకోలేక వెంకట్ సోదరుడు రంగనాథన్ కూడా గుండెపోటుకు గురయ్యాడు. ఆ వెంటనే ఆమె మృతదేహంపై కుప్పకూలి మరణించాడు. తమ సోదరి అంత్యక్రియల సమయంలో రంగనాథన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న సమయంలో ఇది జరిగిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఇక వీరి అంత్యక్రియలు అరంతంగిలో నిర్వహించనున్నట్లు సమాచారం. రెండు వరుస మరణాలు బోస్ వెంకట్ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. ఈ ఘటన తమిళ సినీ, టీవీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ వర్గాల వారు బోస్ వెంకట్ అభిమానులు ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!