NTV Telugu Site icon

Omicron BF7 : చైనా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్.. అలెర్టైన ప్రభుత్వం

Corona Airport

Corona Airport

Omicron BF7 : కరోనాకు పుట్టినిల్లు చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కమ్యూనిటీ వ్యాప్తి కొనసాగుతుండడంతో ప్రభుత్వం పరిస్థితిని కూడా అంచనా వేయలేని విధంగా తయారైంది. వైరస్ బారిన పడిన వారితో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నియంత్రణ చర్యలు ఎంతగా చేపట్టినా కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలోనే.. చైనా నుండి కొలంబో మీదుగా తిరిగి వచ్చిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కుమార్తెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిని తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో దిగగానే టెస్ట్ చేయగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని సీనియర్ ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. మధురై సమీపంలోని విరుదునగర్‌కు చెందిన మహిళ, ఆమె కుమార్తె మంగళవారం ల్యాండ్‌ అయినప్పుడు విమానాశ్రయంలో RT-PCR పరీక్షను నిర్వహించారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది.

Read Also: 3 Indians Died in USA: మంచులో కూరుకుపోయి ముగ్గురు భారతీయుల మృతి

ఈ పరీక్షలో వారికి కరోనాకు పాజిటివ్‌గా తేలిందని అధికారి తెలిపారు. వీరిద్దరూ ప్రస్తుతం విరుదునగర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారితో ప్రయాణించిన వారందరి నమూనాలను ప్రయోగశాలకు పంపనున్నట్లు అధికారి చెప్పారు. ఇది ఇలా ఉంటే.. మంగళవారం తమిళనాడులో 10 పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 51గా ఉంది. చైనా, ఇతర దేశాలలో అకస్మాత్తుగా కరోనావైరస్ కేసులు పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని నాలుగు విమానాశ్రయాలకు చేరుకున్న ప్రయాణీకులందరికీ స్క్రీనింగ్‌ను ముమ్మరం చేసింది. మంగళవారం, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్, చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో కోవిడ్-19 మాక్ డ్రిల్‌ను పరిశీలించిన సందర్భంగా, ఏదైనా ఉంటే వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.