Baby Movie Collections: వర్షంలోనూ ఆగని వసూళ్లు.. ఫస్ట్ వీక్ ‘బేబి’ కలెక్షన్స్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Deverakonda, Vaishnavi Chaitanya Movie Baby 1st Week Collections: సినిమా చిన్నదైనా.. కంటెంట్ ఉంటే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. తక్కువ బడ్జెట్‌తో రిలీజ్ అయిన ‘బేబి’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. గత 3-4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నా.. వసూళ్లు మాత్రం ఆగడం లేదు. చాలా వరకు థియేటర్స్‌లలో హౌస్‌ఫుల్స్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. దాంతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన బేబి కలెక్షన్స్ ఊహకందని విధంగా ఉన్నాయి.
బేబి సినిమా నిన్నటితో (జులై 20) ఫస్ట్ వీక్ పూర్తిచేసుకుంది. 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం 50 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. మొదటివారం పూర్తయ్యేసరికి బేబి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 49.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ.. బాక్సాఫీస్ దగ్గర ఇంత మంచి విజయం సాధించడం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. లవ్ స్టోరీస్‌లో కల్ట్ క్లాసిక్‌గా వచ్చిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
Also Read: Kalki 2898 AD Story: ‘కల్కి’గా ప్రభాస్.. సినిమా స్టోరీ ఇదేనా?
రెండో రోజుకే పెట్టుబడి తిరిగి తెచ్చేసుకున్న బేబీ.. మూడో రోజుకి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించేసింది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి 50 కోట్ల మార్క్ దిశగా వెళ్లింది. ఏ మాత్రం అంచనాల్లేకుండా విడుదలైన బేబీ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. అందరూ ఈ చిత్రాన్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు. అదే సమయంలో వైష్ణవి పాత్రని తిట్టుకుంటున్నారు.
నేషనల్ అవార్డ్ అందుకున్న కలర్ ఫోటో సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్.. బేబీ చిత్రంకు దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ సినిమా జులై 14న రిలీజైంది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్‌ను అందుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంది. ఇక విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది.
Also Read: Prabhas-Ram Charan: ఏదో ఒక రోజు రామ్ చరణ్‌తో సినిమా చేస్తా: ప్రభాస్
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!