NTV Telugu Site icon

Snake Video: షూస్ వేసుకునే ముందు జాగ్రత్త.. ఎందుకు తెలుసా..! వీడియో చూడండి

Snake

Snake

ఒకప్పుడు పాములు చూద్దామంటే కనబడని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజుల్లో వాటి ఆవాసాలను వదిలి ఇళ్లు, కార్లు, బైకుల్లో తిష్టవేస్తున్నాయి. ఎక్కడ వాటికి కాస్త అనుకూలంగా అనిపిస్తే అక్కడే సెటిలైపోతున్నాయి. తాజాగా.. ఓ షూలో నాగుపాము పిల్ల దర్శనమిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఈ వైరల్ వీడియోలో నాగుపాము పిల్ల ఓ షూలో ఉంటుంది. తెలియకుండా దానిని కాలుకు వేసుకున్నామంటే.. అంతే సంగతులు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంటే…

Read Also: Guava Cultivation : జామలో తెగుళ్ల నివారణ చర్యలు..

ఓ మహిళ షూసు వేసుకుందామని వచ్చేసరికి అందులో నాగుపాము పిల్ల దర్శనమిచ్చింది. అది చూసిన మహిళ ఒక్కసారి కంగుతిన్నది. అంతేకాకుండా.. ఆ పాము పిల్ల అందులోనుంచి బయటకు రాకుండా బుసలు కొడుతూ.. షూలోనే తిరుగుతూ ఉంది. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం మీ ఒళ్లు ఒక్కసారిగా జలదరిస్తుంది. కాగా.. షూస్ వేసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు అందులో ఏమైనా ఉన్నాయా అని చూసి వేసుకోవడం మంచిది. లేదంటే ఇలా పాములు, తేళ్లు, విషకీటకాలు దర్శనమిస్తాయి. దాంతో చూడకుండా వేసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది.

Read Also: Kim Jong Un: “మా జోలికి వస్తే ఊరుకోం, మీ శాటిలైట్లని ధ్వంసం చేస్తాం”.. అమెరికాకు కిమ్ వార్నింగ్..

ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై చాలా మంది వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగాదారు.. బేబీ కోబ్రా ఈ రోజు బూట్లు ధరించాలని ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంద రాశారు.మరొక వినియోగదారు మన చుట్టూ జాగ్రత్తగా ఉండాలని రాశారు. ఈ వీడియో ఇప్పటివరకు 75 వేలకు పైగా మంది చూడగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ‘@susantananda3’ అనే ఖాతాతో పోస్ట్ చేశారు.