NTV Telugu Site icon

Baby: మూవీ లవర్స్ కి అలర్ట్.. బేబీ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది..

Whatsapp Image 2023 08 24 At 9.04.12 Pm

Whatsapp Image 2023 08 24 At 9.04.12 Pm

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ చిత్రం సంచలన విజయం సాధించింది. చిత్రం భారీ వసూళ్లు సాధించింది.యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ నటనను అందరూ మెచ్చుకున్నారు. జులై 14న ఈ చిత్రం విడుదల కాగా..అదిరిపోయే టాక్ తో అద్భుత విజయం సాధించింది.అయితే ఈ చిత్రంలో వైష్ణవి నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి.. తనకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఈ భామ ఒదిగిపోయింది. ఈ సినిమాతో ఈ భామకు టాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది .బేబీ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్లింది. సుమారు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టింది. రూ.80 కోట్లపైగానే కలెక్షన్స్ సాధించింది. తక్కువ బడ్జెట్ తో తీసినా కూడా కథ బాగుంటే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ సినిమా నిరూపించింది.

అయితే బేబీ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాను శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్) నిర్మించారు. బేబీ సినిమా థియేటర్ రన్ పూర్తి అయింది.దీనితో ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూసారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ప్రేక్షకుల నిరీక్షణకు తెర పడింది. బేబీ సినిమా నేటి నుంచే ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాను ఆహా ఓటీటీ సంస్థ ఆగస్టు 25 నా స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఈరోజు(ఆగస్టు 24) నుంచే చూడొచ్చు. ఇందుకోసం ఏడాదికి రూ.899 చెల్లించాల్సిన ప్లాన్ తీసుకోవాలి. గతంలోనే ఈ విషయాన్ని ఆహా సంస్థ ప్రకటించింది.బేబి సినిమా చూసేందుకు ఆగలేకపోతే వెంటనే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోమని వెల్లడించింది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే 12 గంటల ముందుగానే బేబి సినిమాను చూసెయ్యొచ్చు.