Baby: మూవీ లవర్స్ కి అలర్ట్.. బేబీ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ చిత్రం సంచలన విజయం సాధించింది. చిత్రం భారీ వసూళ్లు సాధించింది.యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ నటనను అందరూ మెచ్చుకున్నారు. జులై 14న ఈ చిత్రం విడుదల కాగా..అదిరిపోయే టాక్ తో అద్భుత విజయం సాధించింది.అయితే ఈ చిత్రంలో వైష్ణవి నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి.. తనకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఈ భామ ఒదిగిపోయింది. ఈ సినిమాతో ఈ భామకు టాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది .బేబీ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్లింది. సుమారు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టింది. రూ.80 కోట్లపైగానే కలెక్షన్స్ సాధించింది. తక్కువ బడ్జెట్ తో తీసినా కూడా కథ బాగుంటే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ సినిమా నిరూపించింది.
అయితే బేబీ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాను శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్) నిర్మించారు. బేబీ సినిమా థియేటర్ రన్ పూర్తి అయింది.దీనితో ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూసారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ప్రేక్షకుల నిరీక్షణకు తెర పడింది. బేబీ సినిమా నేటి నుంచే ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాను ఆహా ఓటీటీ సంస్థ ఆగస్టు 25 నా స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఈరోజు(ఆగస్టు 24) నుంచే చూడొచ్చు. ఇందుకోసం ఏడాదికి రూ.899 చెల్లించాల్సిన ప్లాన్ తీసుకోవాలి. గతంలోనే ఈ విషయాన్ని ఆహా సంస్థ ప్రకటించింది.బేబి సినిమా చూసేందుకు ఆగలేకపోతే వెంటనే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోమని వెల్లడించింది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే 12 గంటల ముందుగానే బేబి సినిమాను చూసెయ్యొచ్చు.
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!