Site icon NTV Telugu

Babu Mohan: నేను పోటీచేయడంలేదు.. కేఏ పాల్‌ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మేలు..!

Babu Mohan

Babu Mohan

Babu Mohan: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఈ సారి విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. అయితే, కేఏ పాల్‌ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్నారు మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ నాకు సీటు ఇస్తానని మోసం చేసింది.. అందుకే నేను రాజకీయాలకు దూరం అయ్యాను అన్నారు. ఇక, నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. కానీ, కేఏ పాల్‌కి ప్రచారం చేస్తాను అన్నారు. కేఏ పాల్‌ ఆహ్వానం మేరకు ప్రజాశాంతి పార్టీలో చేరాను… వైజాగ్ ఎంపీగా పాల్ పోటీ చేస్తున్నారు, ఆయనకు ప్రచారం చేస్తాను అని స్పష్టం చేశారు. పాల్ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బాబుమోహన్‌.

Read Also: Yarlagadda Venkat Rao: ఏపీలో వచ్చేది టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వమే: యార్లగడ్డ

కేఏ పాల్‌ ఎంపీ అయితే ఇతర దేశాల నుంచి డొనేషన్స్ తెచ్చి మన రాష్ట్ర, దేశ అప్పులు తీర్చుతారు అని వెల్లడించారు బాబుమోహన్‌.. ఎలక్షన్ లో చిన్న, పెద్ద వారికి సారాయి పోస్తున్నారు.. ఎన్నికల తర్వాత వారికి అదే వ్యసనంగా మారుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పాల్ ఎంపీ అయితే మందు పొయ్యరు, ఆయన దేవుని దూత అని పేర్కొన్నారు. కేఏ పాల్‌ ఎంపీగా బ్రహ్మాండంగా పని చేస్తారు.. కాబట్టి ఆయనను ఎంపీగా గెలిపించండి అని పిలుపునిచ్చారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో నన్ను గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కేఏ పాల్‌ కోరారు.. కానీ, నేను వద్దు అన్నాను. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్..

Exit mobile version