Pakistan Skipper Babar Azam Wears Vest It Looks Like a Sports Bra: మైదానంలో తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్.. స్పోర్ట్స్ బ్రాతో దర్శనమిచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు అనంతరం మైదానాన్ని వీడే క్రమంలో బాబర్ స్పోర్ట్స్ బ్రాతో కనిపించాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్, నెటిజన్లు.. బాబర్ ‘స్పోర్ట్స్ బ్రా’ వేసుకోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు పాకిస్తాన్ వెళ్ళింది. గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో 4 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్థాన్.. కొలొంబోలో ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలిచింది. రెండవ టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం సాధించిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మైదానాన్ని వీడుతుండగా.. ఫాన్స్ జెర్సీ ఇవ్వమని కోరాడు. దాంతో అభిమానికి ఇవ్వడానికి తన జెర్సీని అక్కడే తీశేశాడు. దాంతో పాక్ కెప్టెన్ వేసుకున్న స్పోర్ట్స్ బ్రా (Babar Azam Wears Sports Bra) చూసి ఫాన్స్, సెక్యూరిటీ షాక్ అయ్యారు. అయితే బాబర్ వేసుకుంది స్పోర్ట్స్ బ్రాలా కనిపించే ‘వెస్ట్’. సామాన్యులకు ఇది గందరగోళంగా ఉన్నప్పటికీ.. ఇది అథ్లెట్లకు మాములే.
Also Read: Yusuf Pathan Fifty: యూసఫ్ పఠాన్ విధ్వంసం.. 14 బంతుల్లోనే 61 రన్స్! చుక్కలు చూసిన పాక్ బ్యాటర్
బాబర్ ఆజామ్ వేసుకున్న దాన్ని ‘కంప్రెషన్ వెస్ట్’ (Babar Azam Wearing Vest) అంటారు. ఇది భుజాల మధ్య వెనుక భాగాన్ని ఫిట్‌గా ఉంచేందుకు సాయపడుతుంది. ఈ వెస్ట్ చాలా తేలికగా ఉంటుంది. ఎంతలా అంటే.. వేసుకున్నట్లు కూడా ఉండదు. ఇందులో జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది. ఇందులో గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉంటాయి. ఇది ఆటగాడి కదలికలను 3Dలో కొలుస్తూ.. అన్నింటిని ట్రాక్ చేస్తుంది. ఆటగాడి రన్నింగ్ స్పీడ్, హార్ట్ రేట్, శారీరిక శక్తిని మానిటర్ చేస్తుంది. ట్రైనర్ లేదా టీమ్ డేటా సైంటిస్టులకు అవసరమైన అన్ని నంబర్‌లను కంప్రెషన్ వెస్ట్ అందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్లేయర్ ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తారు. దీనిని టీమిండియా ఆటగాళ్లు కూడా ఉపయోగిస్తుంటారు.
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం ముగిసిన రెండో టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకపై గెలిచింది. నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ను పాక్ 576/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో పాకిస్తాన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో లంక 188 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 166 పరుగులకే కుప్పకూలింది.
Also Read: Gold Today Price: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
True Champion #BabarAzam𓃵 Gifted his Test Jersey to a Young Fan.
So Cute🇵🇰💯. #PAKvsSL pic.twitter.com/c6tllleScb— Abu Zayan Awan (@Its_AbuZee) July 27, 2023