Babar Azam: “విరాట్ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam: భారత్‌లో ఐపీఎల్ జరగుతోంది. ఇదే తరుణంలో దాయాది దేశం పాకిస్థాన్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ లీగ్ అనేక వివాదాలకు కారణమైంది. తాజాగా పీఎల్‌ఎల్ నుంచి ఓ ఆసక్తికర సంభాషణ బయటకు వచ్చింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం, ఒక రిపోర్టకు మధ్య జరిగిన మాటలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్ కింగ్స్‌మెన్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం 37 బంతుల్లో 43 పరుగులు చేసి తన జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్యం కేవలం 146 పరుగులే. అప్పటికే క్రీజ్‌లో సెట్ అయిన బాబర్ ఇంత స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేజ్ చేయలేకపోయాడు. దీంతో ఈ అంశంపై పెద్ద వివాదంగా మారింది. జల్మీ జట్టు ఆఖరి బంతికి అతికష్టమ్మీద విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాబర్‌కు చేదు అనుభవం ఎదురైంది.
READ MORE: PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు
Also Read
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ఒక రిపోర్టర్ నేరుగా విరాట్ కోహ్లీ ప్రస్తావన తెస్తూ బాబర్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు. “విరాట్ కోహ్లీ కూడా మీలాగే క్లాసిక్ షాట్లు ఆడతాడు, కానీ అతను మ్యాచ్‌లను ఫినిష్ చేస్తాడు. ఆ విషయంలో మీరు వెనుకబడి ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు, ఈ పోలికపై మీ స్పందన ఏంటి?” అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో అసహనానికి గురైన బాబర్ ఆజం ఆ రిపోర్టర్‌కు గట్టిగానే బదులిచ్చాడు. “ఇలాంటి పోలికలను ఇకనైనా ఆపేసి, ముందుకు సాగండి. నేను మ్యాచ్‌లను ఫినిష్ చేయలేనన్నది కేవలం మీ అపోహ మాత్రమే. ఇవన్నీ మీ దగ్గరే పెట్టుకోండి” అంటూ ఘాటుగా సమాధానమిచ్చాడు.
READ MORE: Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు
వాస్తవానికి పాకిస్థాన్‌లోనే అత్యుత్తమ క్రికెటర్‌గా పేరున్నప్పటికీ, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో బాబర్ తరచుగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటం, భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు బాధ్యత తీసుకోలేకపోవడం వంటి అంశాలపై విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు. ఈ సీజన్ పీఎస్ఎల్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో బాబర్ 126.15 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు. అయితే ఇందులో కేవలం 10 ఫోర్లు, ఒకే ఒక సిక్స్ మాత్రమే ఉండటం అతని బ్యాటింగ్ తీరుపై వస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.
తాజావార్తలు
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!