రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’ వండర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్‌గా ఈ సినిమా రెండు పార్టులను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తే రెస్పాన్స్ మామూలుగా లేదు. అక్టోబర్ 31న విడుదలైన ఈ వెర్షన్, కొత్త సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం మన దగ్గరే కాదు, వరల్డ్ వైడ్‌గా ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను మిస్ అయిన వారు, మళ్ళీ చూడాలనుకునే వారి కోసం ఇప్పుడు ఒక సూపర్ న్యూస్ వచ్చేసింది.
Also Read : Kiara Advani : పర్ఫెక్ట్ బాడీ కంటే మాతృత్వమే గొప్పది..
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ‘బాహుబలి ది ఎపిక్’ వెర్షన్‌ను క్రిస్మస్ గిఫ్ట్‌గా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దాదాపు 3 గంటల 40 నిమిషాల పాటు ఎలాంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా ఈ సినిమాను ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లలో దుమ్ములేపిన ఈ ఎపిక్ మూవీ, ఇప్పుడు ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రభాస్ క్రేజ్ చూస్తుంటే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా రచ్చ మామూలుగా ఉండదని అర్థమవుతోంది!
