Site icon NTV Telugu

Peter Hein : హీరోగా మారనున్న బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్..

Whatsapp Image 2024 01 06 At 1.54.06 Pm

Whatsapp Image 2024 01 06 At 1.54.06 Pm

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటెర్ హెయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఆయన హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.డెబ్యూ దర్శకుడు మా వెట్రీ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రంలో పీటర్ హెయిన్ లీడ్ రోల్ లో నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీ పూర్తిగా భారీ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే పీటెర్ హెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ అధినేత జేఎం బషీర్ మరియు యంటీ సినిమాస్ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నైలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతోనూ లాంఛనంగా ప్రారంభమైంది.

‘బాహుబలి’ మరియు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో పీటర్ హెయిన్ ఎలాంటి స్టంట్స్ ను కొరియోగ్రఫీని అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన యాక్షన్ కొరియోగ్రఫికి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. అంతటి అద్భుతమైన యాక్షన్ కొరయోగ్రఫీ అందించిన ఆయన ఇప్పుడు హీరోగా మారుతున్నారు.అది కూడా పాన్ ఇండియా మూవీలో నటిస్తుండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ ఎలా ఉండబోతోందని ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా  ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పీటర్ హెయిన్ ఆటవివాసిగా కనిపించబోతున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటుండగా ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం చాలా సంతోషమని బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలకు ఫైట్ మాస్టర్గా చేసిన పీటర్ హెయిన్తో సినిమా చేయడం మా అదృష్టమని ప్రొడ్యూసర్స్ తెలిపారు.ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ మాట్లాడుతూ..ఇంతటి భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నందుకు చాలా హ్యాపీ. ఈ సినిమా కోసం తాను ఏమేం చేయగలనో అది చేస్తానని, ఇందులో అటవీ వాసీగా యాక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటించడానికి తాను స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు..త్వరలో రెగ్యులర్ షూటింగ్ షురూ కానున్నట్లు పీటర్ వెల్లడించారు.

Exit mobile version