Peter Hein : హీరోగా మారనున్న బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటెర్ హెయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఆయన హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.డెబ్యూ దర్శకుడు మా వెట్రీ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రంలో పీటర్ హెయిన్ లీడ్ రోల్ లో నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీ పూర్తిగా భారీ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే పీటెర్ హెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ అధినేత జేఎం బషీర్ మరియు యంటీ సినిమాస్ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నైలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతోనూ లాంఛనంగా ప్రారంభమైంది.
‘బాహుబలి’ మరియు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో పీటర్ హెయిన్ ఎలాంటి స్టంట్స్ ను కొరియోగ్రఫీని అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన యాక్షన్ కొరియోగ్రఫికి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. అంతటి అద్భుతమైన యాక్షన్ కొరయోగ్రఫీ అందించిన ఆయన ఇప్పుడు హీరోగా మారుతున్నారు.అది కూడా పాన్ ఇండియా మూవీలో నటిస్తుండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ ఎలా ఉండబోతోందని ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పీటర్ హెయిన్ ఆటవివాసిగా కనిపించబోతున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటుండగా ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం చాలా సంతోషమని బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలకు ఫైట్ మాస్టర్గా చేసిన పీటర్ హెయిన్తో సినిమా చేయడం మా అదృష్టమని ప్రొడ్యూసర్స్ తెలిపారు.ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ మాట్లాడుతూ..ఇంతటి భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నందుకు చాలా హ్యాపీ. ఈ సినిమా కోసం తాను ఏమేం చేయగలనో అది చేస్తానని, ఇందులో అటవీ వాసీగా యాక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటించడానికి తాను స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు..త్వరలో రెగ్యులర్ షూటింగ్ షురూ కానున్నట్లు పీటర్ వెల్లడించారు.
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!