Site icon NTV Telugu

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అయ్యప్ప భక్తుల పడిగాపులు..

Ayaappa

Ayaappa

శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అయ్యప్ప భక్తులు పడిగాపులు కాస్తున్నారు. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లనున్న భక్తులు నానా తిప్పలు పడుతున్నారు. అయితే భక్తులు మధ్యాహ్నమే కొచ్చికి బయలుదేరాల్సి ఉండగా.. ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపంతో ఇంకా వెళ్లలేదు. దీంతో మధ్యాహ్నం నుంచి 64 మంది అయ్యప్ప భక్తులు ఎయిర్ పోర్ట్ లోనే పడిగాపులు గాస్తున్నారు. ఇదే విషయమై ఎయిర్ పోర్టు అధికారులను అడిగితే.. ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని చెబుతున్నారు. కాగా.. తాము వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్లు అన్ని మిస్ అయ్యాయని అయ్యప్ప భక్తులు వాపోతున్నారు. తమ కోసం మరో విమానం ఏర్పాటు చేయకుండా ఎయిరిండియా సిబ్బంది తాశ్చర్యం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఎయిరిండియా నిర్వాకం వల్ల తాము నష్టపోయామని భక్తులు ఆందోళన చేస్తున్నారు.

Exit mobile version