రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు పుట్టిన రోజు ఓ సలహా ఇస్తున్నాను అని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఎందుకు ఇన్ని వేల ఎకరాలు దోచేస్తున్నాను.. ఎవరికయినా ఆరడుగుల స్థలం కావాలి.. నువ్వు పొట్టోడివి కాబట్టి నీకు మూడు అడుగులు చాలు.. నువ్వు అరెస్టు అవుతావ్ అంటే మీ వైసీపీ వాళ్ళు నన్నడుగుతున్నారు అని ఆయన చెప్పారు. నీపై 31 కేసులు ఉన్నాయి.. సీబీఐ దగ్గర పెద్ద రిపోర్ట్ ఉంది.. ఇన్ని కేసులున్న నువ్వు బయట ఉన్నావ్.. ఏ నేరం చెయ్యని చంద్రబాబు ని అరెస్ట్ చేశావ్.. అందుకే నిన్ను 420 సీఎం అంటాను.. గూగుల్ ని అడిగినా నువ్వు 420 సీఎం అని చెబుతుంది.. ఈ విషయం గూగుల్ చెప్తుంది, నేను కాదు అని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
Read Also: Pallavi Prashanth: బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు
నేను వాస్తవమే చెపుతున్నా.. కావాలంటే చెక్ చేసుకోండి అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తుఫాన్ తో నష్టపోయిన బాధితులను ఆదుకోవడం కూడా రాదు.. అప్పుచేసి ఆదుకుంటానని ఎవరైనా చెపుతారా.. గిరిజనులకు ఏం పొడిచావని చింతపల్లికి వెళ్ళావ్.. ఏజెన్సీ లో మంజూరు చేసిన హైడ్రో ప్రాజెక్టుని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. జగన్ స్వంత మనిషికి ఈ ప్రాజెక్టు ఇచ్చావ్.. నువ్వు చింతపల్లిలో కేక్ కట్ చేసే ముందు సమాధానం చెప్పు అని ఆయన ప్రశ్నించారు. 40 గిరిజన గ్రామాలు మునిగిపోతాయ్.. 53 వేల ఎకరాలకు సాగు నీరు అందదు.. నిన్ను గెలిపించిన గిరిజనులకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదా.. పర్యాటక శాఖా మంత్రి హోదాలో గిరిజనులతో డాన్స్ చేసిన రోజా దీని కోసం నోరు ఇప్పలేదే.. పుట్టినరోజు సందర్భంగా జగన్ కు బుద్ధి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు.