ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీవీ ఆనంద్ ఐపీఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. అనంతరం సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు సబ్సిడరీ క్యాంటీన్(Subsidiary Canteen)ను ప్రారంభించి, అందరికీ సభ్యత్వ కార్డులను అందజేశారు.
Read Also: Nobel Prize: సాహిత్యంలో హాన్ కాంగ్‌కు నోబెల్ బహుమతి
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంలో భాగంగా ఈరోజు జరిగిన ఆయుధపూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. దుర్గామాత ఆశీస్సులతో మీరందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉద్యోగము చేసుకోవాలని సిబ్బందిని, అధికారులను కోరారు. అలాగే.. హైదరాబాద్ సిటీ పోలీసులందరికీ దుర్గాష్టమి మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Saddula Bathukamma: తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు..
ఈ కార్యక్రమంలో రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, రాహుల్ హెడ్గే ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్, స్నేహమేరా ఐపీఎస్, డీసీపీ సౌత్ జోన్, ఎన్. శ్వేత ఐపీఎస్, డీసీపీ సీసీఎస్ డీడీ హైదరాబాద్, పాటిల్ కాంతిలాల్ సుభాశ్ ఐపీఎస్, డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ జోన్, ఎన్. భాస్కర్ అదనపు డీసీపీ (అడ్మిన్), బి. కిష్టయ్య అదనపు డీసీపీ (డిప్లాయ్), ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.