NTV Telugu Site icon

Pathan Row: షారుఖ్‌ ఖాన్‌ను సజీవ దహనం చేస్తాను.. సాధువు సంచలన వ్యాఖ్యలు

Pathan Row

Pathan Row

Pathan Row: షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనే జంటగా నటించి ‘పఠాన్’ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట వివాదం ఇంకా చల్లారలేదు. ఆ పాటలో దీపిక ధరించిన కాషాయ రంగు బికినీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యకు చెందిన సాధువు ఛవానీ జగద్గురువు పరమహంస ఆచార్య మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు పఠాన్ సినిమా పోస్టర్ మాత్రమే తగులబెట్టామని, షారుఖ్ ఖాన్ కనిపిస్తే అతడిని సజీవ దహనం చేస్తానని అన్నారు. పఠాన్ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే వాటిని తగులబెడతానని చెప్పాడు. షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ చిత్రాన్ని బహిష్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భగవాన్‌ రంగు కాషాయాన్ని అవమానించారని ఇలాంటి సినిమాలను బహిష్కరించాలన్నారు. షారుఖ్ ఖాన్ ప్రవక్తపై ఎలాంటి వెబ్ సిరీస్ తీయలేదు.. ఆయనకు దమ్ము లేదు.. సనాతన ధర్మాన్ని మాత్రమే అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు సంపాదనే మార్గంగా చేసుకున్నారని ఆరోపించారు. “సనాతన ధర్మాన్ని అవమానిస్తే మరణశిక్ష విధిస్తామని.. షారూఖ్‌ని చూస్తే సజీవ దహనం చేస్తాను” అని పరమహంస ఆచార్య అన్నారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే డ్యాన్స్ సీక్వెన్స్‌ను వర్ణించే ‘బేషరమ్ రంగ్’ అనే పాట విడుదలైనప్పటి నుంచి వివాదానికి దారితీసింది.

Bichagadu 2 : సోషల్ మీడియాలో ‘బిచ్చగాడు 2’ హల్ చల్.. అసలేమైంది

ఈ పాటపై పలువురు బీజేపీ నేతలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. షారుఖ్ ఖాన్, దీపికా పదుకునేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పఠాన్‌ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రం ‘పఠాన్’ నుంచి వచ్చిన పాట ‘బేషరమ్ రంగ్’ పాటే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పాటపై తన అభ్యంతరాలను స్పష్టం చేశారు. ఈ సినిమాపై నిషేధం విధించాల‌ని మ‌ధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి న‌రోత్తం మిశ్రా కోరారు. ఈ మూవీలో కాషాయ దుస్తుల‌ను వాడటం ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రం వ్యక్తం చేశారు. సినిమాలో కొన్ని అభ్యంత‌ర‌క‌ర సీన్లు ఉన్నాయ‌ని, ఈ సీన్లను మార్చనిప‌క్షంలో మ‌ధ్యప్రదేశ్‌లో పఠాన్ మూవీని బ్యాన్ చేస్తామ‌ని హెచ్చరించారు.సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న కాస్ట్యూ్‌మ్స్‌ను, సీన్లను మార్చకుంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరికలు చేశారు. కుమార్ సాహిత్యంతో విశాల్-శేఖర్ కంపోజ్ చేసిన ఈ పాట షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే మధ్య సిజ్లింగ్ కెమిస్ట్రీని ప్రదర్శిస్తుంది. దీనిపై సినీ బృందం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఇక వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న పఠాన్ మూవీ ప్రపంచ‌వ్యాప్తంగా థియేట‌ర్లలో విడుద‌ల కానుంది.