NTV Telugu Site icon

Ayodhya: అయోధ్య వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్..

Ayodhya

Ayodhya

అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. శ్రీ రామ నవమి సందర్భంగా కొంత కాలంగా నిలిపి వేసిన వీవీఐపీ సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చారు. రామ నవమి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే ఛాన్స్ ఉండటంతో.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏప్రిల్ 18 వరకు వీఐపీ దర్శనంతో పాటు పాస్‌ల ద్వారా దర్శనాన్ని నిషేధించింది. దీని వల్ల ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు స్లాట్‌లు బుక్ చేసుకున్న వారి పాస్‌లు సైతం క్యాన్సిల్ అయ్యాయి. ఈ తరుణంలో రామ నవమి ఉత్సవాలు ముగియడంతో వీవీఐపీ దర్శనాన్ని మళ్లీ పునరుద్దరిస్తున్నట్లు ట్రస్టు సభ్యులు స్పష్టం చేసింది.

Read Also: War 2 : ‘వార్ 2’ కోసం రంగంలోకి ఫేమస్ యాక్షన్ డైరెక్టర్.

ఇక, విశిష్ట దర్శన్, సుగం దర్శన్ అనే రెండు కొత్త మార్గాలను ఏర్పాటు చేసినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కేటగిరీలో ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య రెండు గంటల చొప్పున ఆరు వేర్వేరు స్లాట్‌లలో దర్శన సౌకర్యం కల్పిస్తున్టన్లు పేర్కొన్నారు. ప్రత్యేక దర్శనం కోసం ప్రతి స్లాట్‌లో 100 పాస్‌లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 20 పాస్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా మిగతా 80 పాస్‌లను ట్రస్ట్ ద్వారా అందిస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. బాల రాముడి మంగళ, భోగ్, శయన్ ఆరతిలో పాల్గొనడానికి ప్రతి ఆరతికి హాజరయ్యేందుకు 100 పాస్‌లు జారీ చేయనున్నారు. ఇవి ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో అందుబాటులో ఉంటాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.