Site icon NTV Telugu

Ayodhya Ram Mandir LIVE : అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట లైవ్‌ అప్‌డేట్స్‌..

Rammandir

Rammandir

Ayodhya Ram Mandir LIVE : నేడు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట చేయనున్నారు.. దీనికోసం అందంగా ముస్తాబైంది అయోధ్య.. మధ్యాహ్నం 12.29 నుంచి 12.30 వరకు ప్రాణప్రతిష్ట ముహూర్తంగా నిర్ణయించారు.. ఇక, మధ్యాహ్నం 1-2 గంటల మధ్య ప్రధాని మోడీ, మోహన్‌ భగవత్‌, యూపీ సీఎం యోగి ఉపన్యాసాలు చేయనున్నారు.. అయోధ్య వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్యకు చేరుకుంటున్నారు.. అన్ని రాష్ట్రాల రామభక్తులు బలరాముడి దర్శనానికి తరలివస్తున్నారు. మరోవైపు.. కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి అయోధ్య వెళ్లిపోయింది.. రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్య నగరం జనసంద్రంగా మారింది.. శోభాయమానంగా ముస్తాబైన నగరం నలువైపులా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.

The liveblog has ended.
  • 22 Jan 2024 03:03 PM (IST)

    దేశమంతటా రామజ్యోతి

    అయోధ్యలో దీపోత్సవం.. సరయూ నది ఒడ్డున 14 లక్షల దీపాలు వెలిగించిన భక్తులు

  • 22 Jan 2024 02:36 PM (IST)

    ఇవాళ దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్నారు..

    రామ మందిరాన్ని న్యాయబద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మించాం.. దేశం మొత్తం ఇవాళ దీపావళి జరుపుకుంటుంది.. శ్రీ రాముడు భాతరదేశ ఆత్మ.. ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టా.. అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాముడి ప్రధాన ఆలయాలను దర్శించా.. అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నాను.. రాముడు లోకానికి ఆదర్శం: ప్రధాని మోడీ

  • 22 Jan 2024 02:26 PM (IST)

    ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది..

    ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.. ఇది సామాన్యమైన సమయం కాదు.. కాలచక్రంలో ఎప్పటికి నిలిచిపోయే అద్భుత సమయం ఇది ప్రధాని మోడీ.. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో.. అక్కడ హనుమంతుడు ఉంటాడు.. సరయూ నది, అయోధ్యపురికి నా ప్రణామాలు- ప్రధాని నరేంద్ర మోడీ

  • 22 Jan 2024 02:19 PM (IST)

    రామ్ లల్లా దివ్య మందిరంలో ఉంటాడు..

    శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని.. ఎన్నో ఏళ్లుగా నిరిక్షిస్తున్న రాముడు వచ్చేశాడు.. ఈ క్షణం ఎంతో ప్రత్యేకం.. మన రామ్ లల్లా ఇప్పటి నుంచి టెంట్ లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు.. మీ అందరి ఆశీస్సుల వల్లే జరిగింది..

  • 22 Jan 2024 02:09 PM (IST)

    500 ఏళ్ల కల నెరవేరింది..

    500 సంవత్సరాల హిందువుల కల నెరవేరింది.. అన్ని దారులూ రామ మందిరం వైపే చూపిస్తున్నాయి.. మనం త్రేతాయుగంలోకి వచ్చినట్లుంది.. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురు చూశాం.. ప్రాణ ప్రాతిష్ఠకు హాజరైన వారి జీవితం ధన్యమైంది.. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం.. అయోధ్యకు పూర్వ వైభవం వచ్చింది- యూపీ సీఎం యోగి

  • 22 Jan 2024 01:29 PM (IST)

    సామాన్య భక్తులకు రేపటి నుంచి దర్శనం..

    రేపటి నుంచి సామాన్య భక్తులకు బాలరాముడి దర్శనం.. బాలరాముడి దర్శనానికి రెండు స్లాట్స్ ఖరారు.. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు దర్శనం.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం..

  • 22 Jan 2024 01:27 PM (IST)

    నీలమేఘశ్యాముడిగా బాలరాముడు

    స్వర్ణాభరణాలతో బాలరాముడు దర్శనం.. ఎడమచేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాలరాముడు..

  • 22 Jan 2024 01:22 PM (IST)

    రామ్ లల్లాకు ప్రధాని తొలి హారతి

    అయోధ్యలో రామ్ లల్లాకు తొలి హారతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. అయోధ్య రామ మందిరంపై హెలికాప్టర్ తో పూలవర్షం..

  • 22 Jan 2024 12:58 PM (IST)

    రామనామ స్మరణతో ఉప్పొంగిన ప్రతి భారతీయ హృదయం

    కమనీయ వేడుకను చూసి పులకరించిన యావత్ ప్రపంచం.. అయోధ్య భవ్య మందిరంలో దివ్య రామయ్య విగ్రహం ఆవిష్కృతం.. రామనామ స్మరణతో ఉప్పొంగిన ప్రతి భారతీయ హృదయం.. భక్తుల సంబరాల మధ్య అయోధ్యలో త్రేతాయుగం ఆవిష్కృతం.. గణేశ్వర శాస్త్రీ ద్రావిడ నేతృత్వంలో మహాగంభీరంగా క్రతువు.. 12: 29: 03 నుంచి 12: 30: 35 మధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ

  • 22 Jan 2024 12:54 PM (IST)

    రమణీయంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఘట్టం

    రమణీయంగా రామయ్య ప్రాణప్రతిష్ఠ మహోజ్వల ఘట్టం.. పద్మపీఠంపై దేదీప్యమానంగా మెరిసిపోతున్న శ్రీరాముడు.. ఐదు శతాబద్దాల వనవాసం వీడిన రాముడి దర్శనభాగ్యం సాక్షాత్కారం.. రాముడి నుదట ధగధగ మెరిసిపోతున్న వజ్రనామం..

  • 22 Jan 2024 12:43 PM (IST)

    అయోధ్య రామయ్య తొలి దర్శనం..

    అయోధ్య రాముడి తొలి దర్శనం.. అభిజిత్ లఘ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ.. 84 సెకన్ల పాటు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం.. రామనామ స్మరణతో మార్మోగిన అయోధ్య..

  • 22 Jan 2024 12:38 PM (IST)

    అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు..

    అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది.. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు..

  • 22 Jan 2024 12:33 PM (IST)

    వైభవంగా ప్రాణప్రతిష్ఠ..

    అయోధ్యలో వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ.. అభిజిత్ లఘ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ

  • 22 Jan 2024 12:25 PM (IST)

    అయోధ్యలో అపూర్వ ఘట్టం..

    ప్రాణ ప్రతిష్ఠ పూజలు నిర్వహిస్తున్న ప్రధాని మోడీ.. గర్భగుడిలో వేదమంత్రాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు.. రామనామ స్మరణతో మార్మోగుతున్న అయోధ్య..

  • 22 Jan 2024 12:17 PM (IST)

    ప్రాణప్రతిష్ఠ మహోత్సవం

    అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం.. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

  • 22 Jan 2024 12:14 PM (IST)

    రామ మందిరంలోకి ప్రధాని

    రామ మందిర గర్భాలాయంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రధాని చేతిలో బాలరాముడి పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదకలు.. ప్రాణ ప్రతిష్ఠ పూజలు నిర్వహిస్తున్న ప్రధాని మోడీ

  • 22 Jan 2024 11:59 AM (IST)

    అయోధ్యకు వీఐపీల తాకిడి..

    అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి భారీగా వీఐపీలు.. అయోధ్యకు చేరుకున్న మోహన్ భగవత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రజనీకాంత్, అమిత్ బచ్చన్..

  • 22 Jan 2024 11:43 AM (IST)

    బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం..

    అయోధ్యలో 12 గంటల నుంచి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువులు.. ప్రాణప్రతిష్ఠ ముహూర్తం: 12: 29: 03 నుంచి 12: 30: 35 వరకు.. ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోడీ

  • 22 Jan 2024 11:16 AM (IST)

    అయోధ్యలో మధ్యాహ్నం ప్రధాని ప్రసంగం..

    అయోధ్యకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొననున్న ప్రధాని.. మధ్యాహ్నం 1. 15 నిమిషాలకు మోడీ ప్రసంగం..

  • 22 Jan 2024 11:12 AM (IST)

    అయోధ్యలో అతిథుల సందడి..

    ఇప్పటికే చిరంజీవి, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, రాంచరణ్, పవన్ కళ్యాణ్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, అలియా భట్, జాకీ ష్రాఫ్, కంగనా, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్ అయోధ్య రామమందిరం వద్ద సందడి.. ఇక అయోధ్యకు భారీగా సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖులు రావడంతో ఇప్పటికే అయోధ్య ఎయిర్ పోర్ట్ లో దాదాపు 100కు పైగా ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు చేరుకున్నాయి..

  • 22 Jan 2024 11:06 AM (IST)

    అయోధ్యకు ప్రధాని మోడీ

    అయోధ్య ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. కాసేపట్లో రామ జన్మభూమి ఆలయం దగ్గరకు ప్రధాని

  • 22 Jan 2024 10:51 AM (IST)

    అయోధ్య చేరుకున్న ప్రధాని

    ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య చేరుకున్నారు.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్నారు.. ఇక, మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు

  • 22 Jan 2024 10:38 AM (IST)

    ఈఫిల్ టవర్ దగ్గర జై శ్రీరామ్ నినాదాలు..

    ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ దగ్గర రామ భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు.. మువ్వన్నెల జెండాతో పాటు కాషాయ జెండాలను ప్రదర్శించిన రామ భక్తులు.. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పలువురు హిందూవులు కార్లతో భారీ ర్యాలీలు

  • 22 Jan 2024 10:17 AM (IST)

    కాసేపట్లో అయోధ్యకు ప్రధాని మోడీ..

    ఉదయం 10. 25 గంటలకు ఢిల్లీ నుంచి అయోధ్యకు ప్రధాని మోడీ రాక.. నిన్నంతా రామేశ్వరం- ధనుష్కోడి- రామసేతు వద్దు మోడీ పూజలు..

  • 22 Jan 2024 09:56 AM (IST)

    అయోధ్య నమూనాను సాండ్ ఆర్ట్ తో తయారు..

    అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో నెలకొన్న సందడి.. కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, ఇల్లందకుంట రామాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు.. అయోధ్య నమూనాను సాండ్ ఆర్ట్ తో తయారుచేసిన వెంకటేష్ అనే సైకతశిల్పి..

  • 22 Jan 2024 09:51 AM (IST)

    అయోధ్య ఆలయ విశేషలు..

    నేడు ప్రాణ ప్రతిష్ఠ జరుపుతున్న విగ్రహం 51 అంగుళాలు.. అయోధ్య రామాలయం ఉత్తరాది నాగరస్టయిల్లో నిర్మాణం.. 392 పిల్లర్లు, 44 తలుపులతో ఆలయ నిర్మాణం..

  • 22 Jan 2024 09:46 AM (IST)

    అయోధ్యలో ముఖ్యమైన అంశాల వివరాలు..

    నేడు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. మధ్యాహ్నం 12.29 నుంచి 12.30 వరకు ప్రాణప్రతిష్ట ముహూర్తం.. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య మోడీ, మోహన్ భగవత్, సీఎం యోగి స్పీచ్ లు..

  • 22 Jan 2024 09:25 AM (IST)

    అయోధ్యలో 10 వేల సీసీ కెమెరాలు..

    అయోధ్యలో పటిష్టమైన పోలీసుల పహారా.. ప్రాణ ప్రతిష్ట వేదిక దగ్గర, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో గస్తీ.. ఆలయం చుట్టూ కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు.. అయోధ్యలో దాదాపు 10 వేల సీసీ కెమెరాలు

  • 22 Jan 2024 09:23 AM (IST)

    నీలకంఠ పక్షిని చూసేందుకు రామ భక్తులు

    రామ భక్తులు ఈ ప్రాణ ప్రతిష్ట దివ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని పవిత్రమైన నీలకంఠ పక్షిని చూసేందుకు వెళ్తున్నారు. ఆగ్రాలో పెద్ద సంఖ్యలో రామ భక్తులు చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీకి క్యూ కట్టారు.

  • 22 Jan 2024 09:03 AM (IST)

    రామాలయ ప్రారంభోత్సవానికి దూరంగా అద్వానీ..

    అయోధ్య వేడుకకు బీజేపీ కురువృద్దుడు లాల్ కృష్ణ అద్వానీ దూరం.. 96 వయసురిత్యా తొలుత దూరంగా ఉండాలని నిర్ణయం.. ఆ వెంటనే మనుసు మార్చుకుని హాజరవుతానని ప్రకటించిన అద్వానీ.. తీవ్ర చలి ప్రభావంతో హాజరు కావడం లేదని వెల్లడి..

Exit mobile version