NTV Telugu Site icon

Ram Mandir : బీహార్ కళాకారుల అద్భుత కళాఖండం..14లక్షల దీపాలతో రాముడి చిత్రం

New Project (11)

New Project (11)

Ram Mandir : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య ప్రాంతమంతా రాములోరి రాక కోసం రమ్యంగా మారింది. బీహార్‌కు చెందిన కళాకారుల అద్భుతమైన కళాఖండాలు అయోధ్యలో ప్రదర్శించబడ్డాయి. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు ఇక్కడ 14 లక్షల దీపాలతో మహా రాముని విగ్రహాన్ని తయారు చేశారు. ఇది ప్రపంచ రికార్డు నమోదు చేయనుంది.

Read Also:Guntur Kaaram : గుంటూరు కారం సినిమా పై ఆసక్తికర ట్వీట్ చేసిన షారుఖ్ ఖాన్..

బీహార్‌కు చెందిన అనిల్ కుమార్ తన 12 మంది సహచరులతో కలిసి ఈ కళాఖండాన్ని రూపొందించారు. దీని పొడవు 250 అడుగులు కాగా వెడల్పు 150 అడుగులు. ఈ కళాఖండాన్ని మొత్తం 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కళాఖండాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి అశ్విని చౌబే దీని ప్రధాన నిర్వాహకులు. కేంద్ర మంత్రి అశ్విని చౌబే అభ్యుదయ రథయాత్రతో బీహార్ నుంచి అయోధ్య చేరుకున్నారు. అతని కాన్వాయ్‌లో 750కి పైగా వాహనాలు ఉన్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో వేలాది మంది సంబరాలు జరుపుకోనున్నారు. శ్రీరాముని ప్రతిష్ఠాపనకు ముందు అయోధ్యలో ఎన్నో పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి అశ్విని చౌబే నేతృత్వంలోని రాముడి కోసం వందలాది మంది ప్రజలు మిథిలా నుండి ఇక్కడకు వచ్చారు.

Read Also:RGV : ఇండస్ట్రీలోని వారికీ సరికొత్త పాఠం నేర్పినందుకు ప్రశాంత్ వర్మ ను అభినందిస్తున్నా..

చౌబే ఈ రథయాత్రతో బక్సర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అయోధ్య చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతు అయోధ్యలో చేసిన ప్రపంచ రికార్డు గురించి చెప్పాడు. బీహార్‌లోని ప్రతి మత స్థలం నుండి 2000 మందికి పైగా ప్రజలు గంగాజలం, ఇతర కానుకలను తీసుకువెళ్లారు. బీహార్ ప్రజలు కూడా రాముడి పేరిట ప్రపంచ రికార్డు సృష్టించారు.