ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం, దాడులు జరుగుతూనే వున్నాయి. వైసీపీ నేతల దాడిలో కంటి చూపు కోల్పోయిన టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ (chennupati gandhi) ని పరామర్శించారు మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా,ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఈసందర్భంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చెన్నుపాటి గాంధీ పార్టీ కోసం అంకిత భావంతో పని చేస్తారు. గాంధీపై దాడి చేయడం బాధాకరం అన్నారు. దుర్మార్గులు పాలించడం వల్ల దాడులు పెరిగాయన్నారు.
Read Also: Trivikram@20: మాటల మాంత్రికుడు మెగాఫోన్ పట్టి ఇరవై యేళ్ళు!
తప్పులు సరిదిద్దుకోమంటే దాడులు చేస్తారా..? అని మండిపడ్డారు. జగన్ (jaganmohan reddy) తప్పులు చేస్తుంటే టీడీపీ చూస్తూ కూర్చోవాలా..? రాష్ట్ర ప్రజలు ఒక పిచ్చోడికి 2019లో ఓటేశారు. జగన్ టైం ఇంక అయిపోయింది. అమరావతికి కట్టుబడి ఉన్నానన్న జగన్.. గెలిచాక మూడు రాజధానులు అంటున్నాడు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. నాపై 14 కేసులు పెట్టారు. ఇప్పుడు మా అబ్బాయి చింతకాయల విజయ్ వెంట పడ్డారు. న్యాయస్థానాలు లేకపోతే మమ్మల్ని ఇప్పటికే లేపేసేవారు అన్నారు. వైసీపీ నేతల దాడిలో గత నెలలో చెన్నుపాటి గాంధీ కంటికి గాయం అయింది. ఆయన చికిత్స పొందిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ఆయన్ని పరామర్శిస్తున్నారు.
Read Also: CPI Kunamneni Letter to PM Modi: స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన
