Site icon NTV Telugu

SRH vs RCB: విరాట్‌ విశ్వరూపం.. నాల్గో స్థానానికి ఆర్సీబీ

Virat Kohli

Virat Kohli

SRH vs RCB: ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ విశ్వరూపం చూపించాడు. 187 పరుగుల లక్ష్యఛేదనలో ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా వీర బాదుడు బాదాడు కోహ్లీ. 63 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి, సన్‌రైజర్స్‌ ఆటగాడు భువీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన గేల్‌ రికార్డును సమం చేశాడు కోహ్లీ. ఐపీఎల్‌లో ఆరు సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Read Also: Astrology : మే 19, శుక్రవారం దినఫలాలు

మరో ఎండ్‌లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ సునాయాసంగా నెగ్గింది. 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులు చేశాడు డుప్లెసిస్. చివర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక రివర్స్ స్కూప్ తో బౌండరీ సాధించడంతో ఆర్సీబీ గెలుపు ముంగిట నిలిచింది. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 3 పరుగులు అవసరం కాగా… కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో ఈజీగా పరుగులు చేసిన ఆర్సీబీ విజయ ఢంకా మోగించింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్…. 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చెరో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది బెంగళూరు టీం.

Exit mobile version