జేమ్స్ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా గతరాత్రి ప్రీమియర్స్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. అవతార్ సిరిస్ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటు ఇండియాలోని ఈ సినిమాపై క్రేజ్ భారీ స్థాయిలో ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్‌లైన్ ట్రెండ్స్ లోను అవతార్ దూకుడు చూపించింది. ఎప్పుడెప్పుడు అవతార్ ని స్క్రీన్ పై చూద్దామా అని ఈగర్ గా ఎదురు చూశారు ఆడియెన్స్.
Also Read : This Week OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
భారీ అంచనాలా మధ్య రిలీజ్ ఆయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ ప్రేక్షకుల నుండి మిక్డ్స్ రివ్యూ తెచ్చుకుంది. అవతార్పార్ట్ 2 వే ఆఫ్ వాటర్ ఇప్పడు వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ కథ, కథనాలు ఒకేలా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అవతార్ 2 వే ఆఫ్ వాటర్ కంటే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ కాస్త బెటర్ గా ఉంది కానీ అవతార్ 1 రేంజ్ లో లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ – పండోరా కథనం పార్ట్ 2 లాగే ఉంది, ఇది దాని పొడిగించిన వెర్షన్ లా అనిపిస్తుంది. పార్ట్ 3 లో కొత్త మాంగ్‌క్వాన్ తెగ పరిచయం తప్ప కథ పరంగా వావ్ అనిపించే ఫ్యాక్టర్ఏ మీ లేదు. నిడివి కూడా కాస్త ఎక్కువ. అయితే జేమ్స్ కామెరూన్ మేకింగ్, సౌండ్, సీజీఐ, విజువల్స్ అద్భుతం అనే చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ పై సినిమాటిక్ అనుభవం ఇచ్చే అవతార్ 3 తప్పకుండా చూడదగ్గ చిత్రం.
