NTV Telugu Site icon

Avatar 3 : బ్రేకింగ్.. “అవతార్ 3” టైటిల్.. రిలీజ్ డేట్ వచ్చేశాయ్..

New Project (89)

New Project (89)

Avatar 3 : వరల్డ్ క్రేజియెస్ట్ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ‘అవతార్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రాంఛైజ్ లో రెండు భాగాలు ఇప్పటికే వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. అవతార్ రెండు పార్టులు కూడా అత్యధిక ప్రేక్షకాదరణను పొంది వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి. తాజాగా దీని మూడో భాగంపై అప్‌డేట్‌ వచ్చేసింది. దీని టైటిల్‌ను ప్రకటించడంతో పాటు విడుదల తేదీని వెల్లడించారు. ‘అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌’ (Avatar 3) పేరుతో దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మరోసారి పండోర గ్రహానికి వెళ్లడానికి రెడీగా ఉండండని చిత్ర యూనిట్ పేర్కొంది. వచ్చే ఏడాది డిసెంబర్‌ 19న ఇది విడుదల కానున్నట్లు తెలిపారు.

Read Also:Devara 2: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర 2 వచ్చేది అప్పుడే

ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ‘అవతార్‌’ ఓ సంచలనం. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన అద్భుత ప్రపంచమిది. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో అందరినీ కట్టిపడేశారు ఆయన. ఆ తర్వాత ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో మంచి ట్రీట్‌ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ ఫ్రాంచైజీలో రానున్న మూడో పార్టు పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Read Also:Manish Sisodia: 17 నెలల తర్వాత భార్యతో కలిసి చాయ్ తాగిన మనీష్ సిసోడియా

ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు జేమ్స్ కామెరూన్ దీని గురించి మాట్లాడుతూ.. ‘ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టిపెడుతున్నాము. మంచి కథనంతో భారీ విజువల్స్‌తో అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మీ అంచనాలకు మించిన లైవ్‌-యాక్షన్‌ని ఇందులో చూడవచ్చు. మరో కొత్త ప్రపంచాన్ని భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’లో కనిపించిన కేట్‌ విన్స్‌లెట్‌ చేసిన రోనాల్‌ పాత్రను అవతార్‌ 3లో మరింత పొడిగించాం. అందుకోసం ఆమె చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటుంది’ అని చెప్పారు. అవతార్‌ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్‌ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్‌ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.