Site icon NTV Telugu

Hyderabad: బై బ్యాక్‌ పాలసీ పేరుతో కుచ్చుటోపీ.. రూ. 500 కోట్లు స్వాహా..!

Av Infracon Scam

Av Infracon Scam

పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బై బ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలోనే ఒకటికి రెండింతలు డబ్బులు ఇస్తామంటూ చెప్పి బాధితులను నట్టేటా ముంచేశారు. ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరిట ఈ భారీ మోసం చేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏవీ ఇన్ఫ్రా ఛైర్మన్ విజయ్ గోగుల.. మాదాపూర్ కేంద్రంగా బై బ్యాక్ పేరుతో వసూళ్లు చేపట్టాడు. ఏవీ ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చాడు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా తదితర
ప్రాంతాల్లో వెంచర్లు ఉన్నాయంటూ నమ్మించాడు. 18 నెలలకు 50శాతం అదనంగా ఇస్తానని చెప్పి చేతులు ఎత్తేశాడు.

READ MORE: Venkatarami Reddy: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను సస్పెండ్‌ చేయాలి.. వైసీపీ డిమాండ్‌

తీరా అడిగితే 18 నెలల తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉంది అక్కడ ఇస్తాను అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు ఛైర్మన్ విజయ్. గట్టిగ అడిగితే.. బ్లాంక్ చెక్కులు ఇస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు. దుర్గం చెరువు దగ్గర ఏవీ ఇన్ఫ్రా కార్యాలయం కేంద్రంగా దందా ప్రారంభించాడు. సుమారుగా రూ. 500 మందికి వరకు బాధితులు ఉన్నారు.. రూ.500 కోట్ల వరకు మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాజు అనే వృద్ధుడు ఏకంగా రూ.84 లక్షల పెట్టుబడి పెట్టాడు.. ప్రస్తుతం విజయ్ పై మాదాపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

READ MORE: Sonia Gandhi: ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతపై స్పందించిన సోనియా గాంధీ..

Exit mobile version