Delhi Woman Dragged By Car: దిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాద సమయంలో యువతి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే తాజాగా యువతి మృతదేహం శవపరీక్ష పూర్తి అయింది. ఈ శవపరీక్షలో కీలక విషయాలు తెలిశాయి. ఆ యువతి ప్రైవేట్ భాగాల్లో ఎటువంటి గాయాలు లేవని పోస్టుమార్టంలో తెలిసింది. ఆమెపై లైంగిక వేధింపులు జరగలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితురాలు అంజలి సింగ్ తల్లి కూడా తన స్కూటర్‌ను కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి చనిపోయిందని అనుమానం వ్యక్తం చేశారు.
మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలోని వైద్యులు ఈ శవపరీక్ష నిర్వహించారు. పోలీసులకు శవపరీక్ష రిపోర్టును అందజేశామని వెల్లడించారు. తదుపరి పరీక్షల కోసం, నమూనాలు, ఆమె జీన్స్ ప్యాంట్ ముక్కలు భద్రపరచబడ్డాయి. పోలీసులు కారులోని ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంతో మరణానికి కారణమైన అభియోగాల ప్రకారం కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు ఇప్పటికే చెప్పారు. ఏది ఏమైనప్పటికీ పోలీసులకు ఒక కీలక సాక్షి దొరికారు. కారు బాధితురాలి స్కూటర్‌ను ఢీకొట్టినప్పుడు అంజలి స్నేహితురాలు నిధితో ఉన్నారు. ఆ స్నేహితురాలు ఈ ఘటన జరగగానే అక్కడి నుంచి పారిపోయారు. అయితే అంజలి కాలు కారు యాక్సిల్‌లో ఇరుక్కుపోయిందని పలువురు వెల్లడించారు. నిధి ఇప్పుడు కీలక ప్రత్యక్ష సాక్షి అని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు సోమవారం సుల్తాన్‌పురి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
నూతన సంవత్సరం వేళ ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఆదివారం తెల్లవారుజామున 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టి ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కిలోమీటర్ల మేర యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె శరీరం ఛిద్రమెంది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని చూసిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించగా.. అన్ని చెక్‌పోస్ట్‌లను అలర్ట్ చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈలోగా రోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాల ఆధారం కారును గుర్తించిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
Delhi Road Accident: ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్.. స్కూటీపై మరో యువతి కూడా..
ఇదిలా ఉండగా.. కారులో ఉన్న వ్యక్తులు తాము మద్యం సేవించి ఉన్నామని అంగీకరించారు. స్కూటర్‌ను ఢీకొట్టడంతో భయంతో ఓ మహిళను ఈడ్చుకెళ్తున్నట్లు తెలియక వేగంగా వెళ్లిపోయారు. కారు మహిళను వీధుల గుండా ఈడ్చుకుంటూ 13 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, కంఝవాలా వద్ద యూ-టర్న్ వద్ద ఒక చేయి బయటకు రావడం గమనించి వారు ఆగిపోయారు. అప్పుడు ఆమె శరీరం పడిపోవడంతో వారు దూరంగా వెళ్లారు.
మృతదేహాన్ని ఈడ్చుకెళ్లడం చూసిన వ్యక్తుల కాల్‌లకు పోలీసులు స్పందించడంతో కేసు బట్టబయలైంది. పోలీసులను అప్రమత్తం చేసిన వారిలో ఒకరు కారులో ఉన్న వ్యక్తులను కూడా అప్రమత్తం చేయడానికి ప్రయత్నించారు. వారిని స్కూటర్‌పై అనుసరించారు, కానీ అతను వారిని అందుకోలేకపోయాడు.