Site icon NTV Telugu

Nagpur Temperature: నాగ్‌పుర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత.. క్లారిటీ ఇచ్చిన వాతావరణ శాఖ

Summer Effect

Summer Effect

దేశ వ్యాప్తంగా ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంత ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా నాగ్‌పుర్‌లో ఓ వాతావరణ స్టేషన్‌లో గురువారం ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. దీంతో.. జనాలు బెంబెలెత్తిపోయారు. అయితే.. అధికంగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు రీసెర్చ్ చేసి నిజం కాదని తేల్చింది. ఉష్ణోగ్రతను నమోదు చేసే సెన్సర్‌ సరిగా పనిచేయడం లేదని స్పష్టతనిచ్చింది.

Read Also: Power Cuts: గమనిక.. నేడు హైదరాబాద్ లో పవర్ కట్..

కాగా.. నాగ్‌పుర్‌లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్స్‌ (AWS)ను ఏర్పాటుచేసింది. ఇందులో రెండు గురువారం అసాధారణ ఉష్ణోగ్రతలు చూపించాయి. సోనేగావ్‌లోని ఏడబ్ల్యూఎస్‌ స్టేషన్‌లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. అయితే.. మిగతా రెండు స్టేషన్లలో మాత్రం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సైట్ పరిస్థితులు, సెన్సార్లు లేదా రక్షణ కవచాలు దెబ్బతినడం వంటి వివిధ కారణాల వల్ల ఆటోమేటిక్ సిస్టమ్‌లు తప్పు రీడింగ్‌లను నివేదించవచ్చని వాతావరణ కార్యాలయం తెలిపింది. కాగా.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవ్వడంతో ఈ వార్త దేశమంతా వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. 52.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన ముంగేష్‌పూర్‌లోని AWSపై దర్యాప్తు నివేదిక ఇంకా కొనసాగుతోంది.

Read Also: Amit Shah: కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని ప్రచారం చేసింది.. ఎందుకు దూరంగా ఉంటున్నారు..?

Exit mobile version