NTV Telugu Site icon

Viral Video: అతి తెలివి చూపిన ఆటో డ్రైవర్.. తిక్క కుదిర్చిన పోలీసులు

Auto

Auto

Auto Driver Rides On Foot Over Bridge: ట్రాఫిక్ లో ఇరుక్కోవడం అనేది పెద్ద తలనొప్పి. కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ లో నుంచి బయట పడటానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. సగం జీవితం ట్రాఫిక్ లోనే అయిపోయిందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు వంటి నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీంతో ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి తరచూ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బైక్ లు, స్కూటీలు లాంటి చిన్న వాహనాలు, చిన్న గల్లీలలో నుంచి, తక్కువ ఖాళీ ఉన్న ప్రదేశాల్లో నుంచి వెళ్లిపోతూ ఉంటాయి. అయితే పాపం బస్సులు, కార్లు, ఆటోలు లాంటి మూడు చక్రాలు, నాలుగు చక్రాలు ఉన్న వాహనాలు మాత్రం ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ పడేంత వరకు వేచి ఉండాల్సిందే. అయితే ఇలా వేచి ఉండటం ఇష్టం లేని ఓ యువకుడు రద్దీగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచే తన ఆటోను పోనిచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Viral Video: నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? దానికిదే సాక్ష్యమా?

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాడు మున్నా అనే ఓ 20 ఏళ్ల యువకుడు. గ్రీన్ సిగ్నల్ పడేంతవరకు ఆ యువకుడు ఆగలేకపోయాడు. దీంతో తన ఆటోను జనాలు వెళ్లే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి ఎక్కించేశాడు. వీడియో చూస్తే ఓ వ్యక్తి ఆటోను బ్రిడ్జ్ పైకి పోనించగానే మరొ వ్యక్తి కొంతదూరం వెళ్లగానే దానిలో ఎక్కుతాడు. తరువాత పెద్దగా హారన్ కొట్టుకుంటూ ఆ ఆటోవాలా వెళ్లిపోతాడు. అయితే ఆ సమయంలో ఎవరైనా బ్రిడ్జ్ మీద వస్తుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఆటో డ్రైవర్ ఇలా చేయడంతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల కంటిలో పడింది. ఆటో నంబర్ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

 

 

 

 

.