Site icon NTV Telugu

Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ స్టార్‌ బ్యాట్స్‌మెన్

Shaun Marsh

Shaun Marsh

Retirement: ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ షాన్‌ మార్ష్ ఫస్ట్‌ క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకనుంచి కేవలం టీ20ల్లో మాత్రమే కొనసాగాలని షాన్ మార్ష్ ఫిక్స్ అయ్యాడు. 39 ఏళ్ల మార్ష్‌ 2001లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. 2022లో ప్రతిష్టాత్మక షెఫీల్డ్ షీల్డ్‌ ట్రోఫీని సారథిగా ఆస్ట్రేలియాకు అందించాడు. ఆస్ట్రేలియా తరపున 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. షాన్ మార్ష్ 2019లోనే టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 236 మ్యాచుల్లో 12,811 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు సాధించాడు. లిస్ట్‌-ఎ కెరీర్‌లో 177 మ్యాచ్‌లు ఆడిన మార్ష్‌.. 44.45 సగటుతో 7158 పరుగులు చేశాడు.

Read Also: Youngest Yoga Instructor: ఏడేళ్ల వయస్సులోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. యోగా శిక్షకురాలిగా..

2011లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాన్ మార్ష్..మొత్తం 38 టెస్టుల్లో 34.31 సగటుతో 2265 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 10 అర్థసెంచరీలున్నాయి. 2008లోనే విండీస్ తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. మొత్తంగా ఇప్పటి వరకు 15 టీ20ల్లో 18.21 సగటుతో 255 పరుగులు మాత్రమే చేశాడు. కాగా ప్రస్తుతం షాన్‌ మార్ష్‌ సోదరుడు మిచెల్ మార్ష్‌ ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Exit mobile version