NTV Telugu Site icon

Flight: విమానంలో నగ్నంగా పరుగులు.. ప్యాసింజర్స్ షాక్

1

1

ఈ మధ్య విమానాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్య ఓ ప్యాసింజర్‌.. ఏకంగా మరో ప్యాసింజర్‌పై మూత్రం పోసిన సంఘటన తెలిసిందే. అటు తర్వాత మరికొంత మంది జుగ్సుపకరంగా ప్రవర్తించిన సంఘటనలు చూశాం. తాజాగా ఆస్ట్రేలియా విమానంలో మరో వింతైన సంఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే ఓ ప్రయాణికుడు నానా హంగామా సృష్టించాడు. ఒంటిపైనున్న దుస్తులు తొలగించి విమానంలో నగ్నంగా పరుగులు తీశాడు. ఈ హఠాత్తు పరిణామంతో ప్యాసింజర్స్ అంతా అవాక్కయ్యారు. ఈ ఘటన వర్జిన్‌ ఆస్ట్రేలియా విమానంలో చోటుచేసుకొంది.

ఇది కూడా చదవండి: SIT Movie: జీ5 టాప్ 5లో ట్రెండ్ అవుతున్న SIT!

ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ ఫ్లైట్‌లో నగ్నంగా పరిగెత్తించాడు. అనంతరం విమానాన్ని వెనక్కి తిప్పడానికి బలవంతం చేశాడు. దీంతో ఆ వ్యక్తిని విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. పశ్చిమ తీర నగరం పెర్త్ నుంచి తూర్పు తీరంలోని మెల్‌బోర్న్‌కు సోమవారం రాత్రి 3 గంటల 30 నిమిషాల వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో ఈ సంఘటన జరిగింది.

ఇది కూడా చదవండి: జూన్ – 2024లో తిరుమలలో ప్రత్యేక రోజులు ఇవే..

ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు VA696 విమానం సోమవారం రాత్రి బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని కింద పడేశాడు. అతడి చర్యకు తోటి ప్రయాణికులు హడలెత్తారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. విమాన సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆ వ్యక్తి అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని విమాన సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: WhatsAppUpdate: వాట్సప్ లో కొత్త అప్‌డేట్‌..ఇకపై ఒక నిమిషం వరకు అవకాశం

Show comments