NTV Telugu Site icon

Australian Open Men’s Singles Final: ఆస్ట్రేలియన్ ఓపెన్‌ విన్నర్ జానిక్‌ సిన్నర్‌.. ఫ్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

Jannil Sinner

Jannil Sinner

పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కొత్త ఛాంపియన్‌ అవతరించాడు. ఇటాలియన్‌ యువ టెన్నిస్‌ ప్లేయర్‌ జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచాడు. ఈరోజు జరిగిన టైటిల్ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్‌ను ఐదు సెట్లలో ఓడించాడు. ఈ మ్యాచ్‌లో సిన్నర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్ గెలిచిన తొలి ఇటాలియన్ ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు.

Read Also: Gaami: అఘోరగా మారిన విశ్వక్ సేన్.. భయపెట్టేస్తున్నాడుగా

ఈ మ్యాచ్ లో తొలి రెండు సెట్లు మెద్వెదెవ్ బాగా ఆడి.. అతను మ్యాచ్ గెలిచేలా చేశాడు. కానీ.. జానిక్ సిన్నర్ పదునైన సర్వీసులు, కచ్చితమైన ప్లేస్ మెంట్ల, బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో మెద్వెదెవ్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో జానిక్ సిన్నర్ తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించాడు. మెద్వెదేవ్ గతంలో 2021లో యుఎస్ ఓపెన్ గెలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన సిన్నర్ కు ట్రోఫీతో పాటు రూ.26 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ గా నిలిచిన మెద్వెదెవ్ కు రూ.14 కోట్లు దక్కాయి.

Read Also: Janasena: ఫిబ్రవరి 4న జనసేన ఎన్నికల శంఖారావం..?

స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాన్ వావ్రింకా చివరిసారిగా 2014లో టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతని తర్వాత కొత్త ఛాంపియన్ ఎవరు లేరు. 2004లో స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్, సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ మరియు స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్ మాత్రమే ఈ టోర్నీని గెలుపొందారు. 2004 నుండి ఫెదరర్ ఆరుసార్లు ఛాంపియన్ అయ్యాడు. జకోవిచ్ అతని కంటే 10 రెట్లు ఎక్కువగా టైటిల్ గెలుచుకున్నాడు. నాదల్ రెండుసార్లు ఛాంపియన్ అయ్యాడు. కాగా, రష్యాకు చెందిన మరాట్ సఫిన్ 2005లో ఛాంపియన్ అయ్యాడు.

Show comments