Bob Cowper: టెస్ట్ క్రికెట్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన దిగ్గజ ప్లేయర్ ఇకలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bob Cowper: తాజాగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ టెస్ట్ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper) 84 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడి తుది శ్వాస విడిచారు. బాబ్ కౌపర్ టెస్ట్ క్రికెట్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా గుర్తింపు పొందారు. ఇక ఈ దిగ్గజ క్రికెటర్ తన టెస్ట్ క్రికెట్ కెరియర్ లో 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 46.84 సగటుతో మొత్తం 2061 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన 1966లో మెల్‌బోర్న్‌లో ఇంగ్లాండ్ జట్టుపై జరిగిన టెస్టులో 307 పరుగులతో అజేయంగా నిలిచి తన ప్రతిభను చాటారు.
Read Also: Aadi Srinivas: ముఖ్యమంత్రిని బూతులు తిడితే పదవి వస్తుందనుకోవడం నీ అవివేకం..!
Also Read
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బాబ్ కౌపర్ విక్టోరియా జట్టు తరఫున ఎక్కువగా ఆడారు. మొత్తం 147 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఆయన 10,595 పరుగులు చేసి, 183 వికెట్లు కూడా తీశారు. ఆయన ఎడమచేతి వాటం బ్యాటర్‌గా మంచి స్ట్రోక్ ప్లే, ఓపికతో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే తీరుకు ఆయన పెట్టింది పేరు. కౌపర్ స్వదేశంలో తన బ్యాటింగ్ సగటు 75.78 కాగా, విదేశాల్లో అది 33.33 మాత్రమే. ఇక ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత స్వదేశంలో అత్యధిక టెస్ట్ బ్యాటింగ్ సగటు బాబ్ కౌపర్‌దే. ఇక ఆయనకు కేవలం 27 సంవత్సరాల వయస్సులో అంటే 1968లోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికి, తన వ్యాపారంపై దృష్టి పెట్టారు. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత ఆయన వ్యాపార రంగంలో విజయాలు సాధించారు. ఆ తర్వాత కూడా ప్రపంచ క్రికెట్ లో రెండు టెస్టులు, 14 వన్డేలకు ఆయన రిఫరీగా కూడా పని చేశారు.
Read Also: Raj Tarun: తమిళ్ ‘గోలీసోడా’ కొట్టేందుకు రెడీ అయిన రాజ్ తరుణ్
ఇక బాబ్ కౌపర్ మృతిపై ఆస్ట్రేలియా క్రికెట్ సోషల్ మీడియా తరపున సంతాపం వ్యక్తం చేసింది. ఇందులో.. బాబ్ కౌపర్ అత్యంత ప్రతిభావంతుడైన బ్యాటర్ అని, ఆయన సొగసైన ఆటతీరు, నిబద్ధత, బ్యాటింగ్‌లో నైపుణ్యం ఆయన్ని ప్రత్యేకంగా నిలిపాయని రాసుకొచ్చింది. బాబ్ కౌపర్ మృతితో ఆస్ట్రేలియా క్రికెట్ మరియు అంతర్జాతీయ క్రికెట్ లోకానికి తీరని లోటు ఏర్పడింది. ఆయన క్రీడా సేవలకు క్రికెట్ ప్రపంచం శ్రద్ధాంజలి అర్పిస్తోంది.
Today, Australian Cricket is mourning the loss of Bob Cowper OAM.
Bob was an elegant left-handed batter who scored five Test centuries for Australia, including a superb Ashes triple-century at the MCG in 1966.
Our thoughts are with Bob's family, friends and teammates. pic.twitter.com/Zod0pDRH9T
— Cricket Australia (@CricketAus) May 11, 2025
తాజావార్తలు
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!