NTV Telugu Site icon

World Cup 2023: స్టీవ్ స్మిత్ ఖాతాలో చెత్త రికార్డు.. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి!

Steven Smith Batting

Steven Smith Batting

Steve Smith Goes For Duck For 1st Time In World Cup: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదు అయింది. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి డకౌట్ అయ్యాడు. దాంతో ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా డకౌట్ అవ్వని స్మిత్ పరంపరకు తెర పడింది. ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లో స్మిత్ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఇనింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ త్వరగానే పెవిలియన్ చేరారు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక నాలుగో ఓవర్ తొలి బంతికి వార్నర్‌ను (11) ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. వార్నర్ ఔట్ కావడంతో స్మిత్ నాలుగో ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఐదు బంతులు ఎదురొన్న స్మిత్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.

Also Read: IND vs BAN: టీమిండియాతో మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ!

స్టీవ్ స్మిత్ 22 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. 23వ ఇన్నింగ్స్‌లో మొదటి డకౌట్‌ను నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన స్మిత్.. 23 ఇన్నింగ్స్‌లలో 42.80 సగటుతో 899 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. స్మిత్ తన కెరీర్‌లో నాలుగో వన్డే ప్రపంచకప్ ఆడుతున్నాడు. 2011లో కెరీర్‌లో మొదటి వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ఆడాడు. కెరీర్ ఆరంభంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా సేవలందించిన అతడు ఇప్పుడు టాప్ బ్యాటర్‌గా ఉన్నాడు.

Show comments