World Cup 2023: స్టీవ్ స్మిత్ ఖాతాలో చెత్త రికార్డు.. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steve Smith Goes For Duck For 1st Time In World Cup: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదు అయింది. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి డకౌట్ అయ్యాడు. దాంతో ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా డకౌట్ అవ్వని స్మిత్ పరంపరకు తెర పడింది. ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లో స్మిత్ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఇనింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ త్వరగానే పెవిలియన్ చేరారు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక నాలుగో ఓవర్ తొలి బంతికి వార్నర్‌ను (11) ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. వార్నర్ ఔట్ కావడంతో స్మిత్ నాలుగో ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఐదు బంతులు ఎదురొన్న స్మిత్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
Also Read: IND vs BAN: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ!
స్టీవ్ స్మిత్ 22 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. 23వ ఇన్నింగ్స్‌లో మొదటి డకౌట్‌ను నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన స్మిత్.. 23 ఇన్నింగ్స్‌లలో 42.80 సగటుతో 899 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. స్మిత్ తన కెరీర్‌లో నాలుగో వన్డే ప్రపంచకప్ ఆడుతున్నాడు. 2011లో కెరీర్‌లో మొదటి వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ఆడాడు. కెరీర్ ఆరంభంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా సేవలందించిన అతడు ఇప్పుడు టాప్ బ్యాటర్‌గా ఉన్నాడు.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!