Site icon NTV Telugu

Australia: వన్డే ప్రపంచకప్‌లో ఎదురేలేదు.. అప్పుడే సెమీస్‌కి వచ్చేశారుగా!

Australia Women Cricket

Australia Women Cricket

ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో ఆస్ట్రేలియా అజేయంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఆసీస్ గెలిచింది. వరుస విజయాలతో సెమీస్‌లో దూసుకెళ్లింది. సెమీస్‌లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా కూడా ఆసీస్ నిలిచింది. మెగా టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌.. నాలుగింట్లో గెలవగా, ఒక మ్యాచ్‌ రద్దయింది. నాలుగు కంటే ఎక్కువ జట్లు 9 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో.. ఆస్ట్రేలియాకు సెమీస్‌ బెర్తు ఖరారయింది.

Also Read: 77th IPS Batch: 77వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్యఅతిథిగా బీఎస్ఎఫ్ డైరెక్టర్!

బంగ్లాదేశ్‌తో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టు అటు బంతితో, ఇటు బ్యాట్‌తో విజృంభించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు ఏ దశలోనూ బంగ్లా పోటీ ఇవ్వలేదు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులకే పరిమితమైంది. శోభన (66 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఛేదనలో కెప్టెన్‌ అలీసా హీలీ (113 నాటౌట్‌; 77 బంతుల్లో 20×4) మరోసారి అజేయ సెంచరీతో రెచ్చిపోయింది. హీలీ రెచ్చిపోవడంతో 24.5 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫోబి లిచ్‌ఫీల్డ్‌ (84) మెరిసింది.

Exit mobile version