NTV Telugu Site icon

Australia Players: ఇ–రిక్షాలో చక్కర్లు.. సూపర్ అంటూ వీడియో షేర్ చేసిన స్టార్ క్రికెటర్

Cricket

Cricket

క్రికెట్ వరల్డ్ కప్ కు సర్వం సిద్దమయ్యింది. అన్ని దేశాల తమ జట్లను కూడా ప్రకటించాయి. అసలైన సమరానికి ముందు వార్మప్ మ్యాచ్ లకు కూడా జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వివిధ జట్లు భారత్ చేరకున్నాయి. మొన్న పాక్ జట్టు హైదరాబాద్ చేరుకోగా తాజాగా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు కేరళ వెళ్లింది ఆస్ట్రేలియా క్రికెటర్ల టీం. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు తన తొలి వార్మప్ మ్యాచ్ లో భాగంగా  నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇక దీనికి ముందు కొద్దిగా రిలాక్స్ అవుదామనుకున్న క్రికెటర్లు కేరళ రోడ్లపై షికార్లు కొట్టారు.  కేరళ అందాలను ఆస్వాదించారు.

Also Read: Tamilisai: మోడీ నాయకత్వంతోనే మహిళ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది..! గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

కొంతమంది ఆటగాళ్లు ఇ- రిక్షాలో ప్రయాణించారు. వారిలో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, సీన్ అబాట్ ఉన్నారు. రిక్షాలో సముద్రా తీరాన్ని చేరుకొని అందాలను వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్మిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే తొలి వార్మప్ మ్యాచ్ ను నెదర్లాండ్స్ తో ఆడనున్న ఆస్ట్రేలియా అక్టోబర్‌ 3న పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇక వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ను కమిన్స్ సేన అక్టోబర్‌ 8న టీమిండియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ తమిళనాడులోని చెన్నైలో జరగనుంది. ఇక వరల్డ్ కప్ లో పాల్గొనే ఆస్ట్రేలియా టీం చూసినట్లయితే  పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్‌, కెమరూన్‌ గ్రీన్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, సీన్‌ అబాట్‌, మార్నస్‌ లబూషేన్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిస్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌ ఉన్నారు.