NTV Telugu Site icon

Will Pucovski: సంచలనం.. 26 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు..

Will Pucovski Retire

Will Pucovski Retire

Australia Player Will Pucovski Retire: ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్స్కీ క్రికెట్ కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. అనేక తల గాయాల కారణంగా, వైద్యులు అతనిని క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కారణంగా ఈ వర్ధమాన ఆస్ట్రేలియా క్రికెటర్ ఇంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు పుకోవ్స్కీ తలకు చాలాసార్లు గాయాలయ్యాయి. మార్చి 2024లో అతనికి తగిలిన గాయం చాలా తీవ్రంగా మారింది. పదే పదే గాయాలు అతని ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

SPY Camera: దారుణం.. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్‌ టాయిలెట్స్‌లో రహస్య కెమెరా..

మెడికల్ ప్యానెల్ సిఫారసు మేరకు 26 ఏళ్ల ఆటగాడు క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. 2022లో జరిపిన వైద్య పరీక్షలో అతని తల గాయాలు కొన్ని అసలు గాయాలు కావని.., ఒత్తిడి కారణంగా సంభవించాయని తేలింది. ఇది అతని అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించడం మరింత కష్టతరం చేసింది. పుకోవ్స్కీ తన చిన్న కెరీర్‌లో 13 సార్లు బంతిని తలకు తగిలించుకున్నాడు. పుకోవ్స్కీ జనవరి 2021లో భారత్‌ తో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతను అద్భుతంగా ఆడాడు. కానీ. అతని కెరీర్ పదేపదే గాయాలతో ప్రభావితమైంది. దాని కారణంగా అతను అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను ఎక్కువగా ప్రదర్శించలేకపోయాడు. పుకోవ్‌స్కీ 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ ల్లో 45 కంటే ఎక్కువ సగటుతో 2350 పరుగులు చేశాడు. ఐకమరోవైపు 14 లిస్ట్ A మ్యాచ్‌ లలో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీల సహాయంతో 333 పరుగులు చేశాడు. పుకోవ్స్కీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడి ఆ టెస్టు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు.