Australia Squad Announcement: ఆస్ట్రేలియా భారతదేశంపై బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల కోసం తమ జట్టును ప్రకటించింది. జట్టులో ఓపెనర్ సామ్ కాన్ట్సాస్‌ను ఎంపిక చేయగా, నాథన్ మెక్‌స్వీనీని జట్టు నుండి తప్పించారు. ఆల్‌రౌండర్ బో వెబ్‌స్టర్, ఫాస్ట్ బౌలర్లు సీన్ అబాట్, జై రిచర్డ్సన్‌లను కూడా మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల కోసం 15 మంది సభ్యుల జట్టులో చేర్చారు. ఈ నేపథ్యంలో సామ్స్ కాన్ట్సాస్ కు ఆడే అవకాశం లభిస్తే 2011లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ తర్వాత ఆసీస్ తరఫున టెస్టు ఆడే అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధిస్తాడు. ఇదివరకు బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టులో భారత్‌తో డ్రా చేసిన జట్టులో నుంచి కేవలం మెక్‌స్వీనీనే తప్పించబడ్డాడు. ఈ సిరీస్‌లో మూడు టెస్టులలో ఆరు ఇన్నింగ్స్ ఆడి 72 పరుగుల మాత్రమే చేయగలిగిన మెక్‌స్వీనీని జట్టు నుండి తొలగించారు. ఈ జట్టు ఎంపిక ఆసీస్ క్రికెట్ జట్టుకు కొత్త శక్తిని చేకూరుస్తూ, యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను చూపించుకునే అవకాశాన్ని అందిస్తోంది.
Also Read: Gold And Silver Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఆస్ట్రేలియా జట్టు స్క్వాడ్ ఇలా ఉంది. పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, ట్రావిస్ హెడ్స్ (ఉప కప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, జై రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, బో వెబ్‌స్టర్.