NTV Telugu Site icon

Canada: భారత్ పై కెనడా ఆరోపణలు.. స్పందించిన బ్రిటన్, ఆస్ట్రేలియా

Kalisthan

Kalisthan

కెనడా ప్రభుత్వం, భారత్ ల మధ్య  ప్రస్తుతం ఖలిస్తానీ చిచ్చు రగులుతున్న విషయం తెలిసిందే. జీ20 సమావేశాలకు హాజరైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ఈ విషయం గురించి చర్చించిన కొద్ది రోజులకే ఈ రగడ మరింతగా ముదిరిపోయింది. కెనడా ప్రధాని ఖలిస్తానీ ఉగ్రవాదిని చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని తమ ప్రభుత్వం వద్ద నమ్మదగిన సాక్ష్యాలు ఉన్నాయని ప్రకటించినప్పటి నుంచి ఈ వివాదం మరింత రాజుకుంటుంది. అయితే ఈ వ్యాఖ్యలను ఇప్పటికే భారత్ ఖండించింది. ఈ చర్యల్లో భాగంగా భారతదౌత్య వేత్తను కెనడా బహిష్కరించగా, ఆ దేశ అధికారిని కూడా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్ హుకుం జారీ చేసింది. ఇక కెనడా వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి.

Also Read: Khalistani Terrorists: వాళ్లు కెనడాలో కూర్చుని స్కెచ్ వేస్తే.. పంజాబ్ లో భూమి అదురుద్ది

ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ఈ ఆరోపణలపై స్పందించింది. దీనిపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై అటు ఆస్ట్రేలియా, ఇటు బ్రిటన్ కూడా స్పందించాయి. ఇక భారత్ పై కెనడా చేసిన ఆరోపణలపై బ్రిటన్ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కెనడా భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నాం.  అధికారులు ఈ విషయంపై  దర్యాప్తు చేస్తున్నందున దీనిపై వ్యాఖ్యానించడం సరికాదు పేర్కొన్నారు. ఇక దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా ఈ ఆరోపణలు ఎంతో ఆందోళన కలిగించాయని పేర్కొంది. దీనిపై కొనసాగుతున్న దర్యాప్తు గురించి తెలుసుకున్నామని తెలిపిన ఆస్ట్రేలియా ఈ పరిణామాలపై మిత్రదేశాలతో సంప్రదింపులు చేస్తున్నాం అని వెల్లడించింది. తమ ఆందోళనను భారత్ సీనియర్ అధికారులకు తెలియజేసినట్లు పేర్కొంది.

ఇక ఖలిస్తానీ ఉద్యమం, భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న హర్డీప్ సింగ్ నిజ్జర్ ను ఈ ఏడాది జూన్ 18న వాంకోవర్ లోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తలు కాల్చిచంపారు. అయితే ఆ ప్రాంతం సిక్కులకు కేంద్రంగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఈ హత్య జరగడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే ఇందులో భారత్ హస్తం ఉందని, ఇలా కెనడా పౌరులను హత్య చేయడం, దేశ సార్వభౌమత్వంలో తల దూర్చడమే అని దీనిని కెనడా ఎప్పటికీ ఒప్పుకోదు అంటూ కెనడా ప్రధాని భారత్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భారత్ ఖండించింది. ఇక ఈ ఆరోపణలపై అగ్రరాజ్యంతో సహా ఒక్కొక్క దేశాలు స్పందిస్తున్నాయి.