Site icon NTV Telugu

AUS vs WI: చెలరేగిన హాజిల్‌వుడ్‌, కమిన్స్‌.. ఓపెనర్‌గా స్టీవ్‌ స్మిత్‌ విఫలం!

Steven Smith Test

Steven Smith Test

Steven Smith Out for 12 as Test Opener: రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య బుధవారం తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా (౩౦), కామెరాన్ గ్రీన్ (6) ఉన్నారు. విండీస్‌ అరంగేట్రం పేసర్‌ షమార్‌ జోసఫ్‌ 2 వికెట్లు తీశాడు. అయితే ఓపెనర్‌ అవతారం ఎత్తిన స్టీవ్‌ స్మిత్‌ (12) విఫలం అయ్యాడు.

తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా పేసర్లు జోష్‌ హాజిల్‌వుడ్‌ (4/44), పాట్‌ కమిన్స్‌​ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే ఆలౌటైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కిర్క్‌ మెక్‌కెంజీ (50) రాణించాడు. ఓపెనర్లు బ్రాత్‌వైట్‌ (13), తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (6), అలిక్‌ అథనాజ్‌ (13), కవెమ్‌ హాడ్జ్‌ (12), జస్టిన్‌ గ్రీవ్స్‌ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్‌ (14), మోటీ (1) నిరశపర్చారు. అయితే 11వ నంబర్‌ ఆటగాడు షమార్‌ జోసఫ్‌ (35) మంచి ఇన్నింగ్స్‌ ఆడి విండీస్‌ పరువు కాపాడాడు. కీమర్‌ రోచ్‌తో (17 నాటౌట్‌) కలిసి షమార్‌ చివరి వికెట్‌కు ఏకంగా 55 పరుగులు జోడించాడు.

Also Read: Captain Miller Trailer: టాలీవుడ్ అగ్ర హీరోల చేతుల మీదుగా కెప్టెన్‌ మిల్లర్‌ ట్రైలర్!

విండీస్ ఆలౌట్ అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ ఆరంబించింది. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ అనంతరం ఓపెనర్‌గా స్టీవ్‌ స్మిత్‌ కొత్త అవతారం ఎత్తాడు. అయితే అతడు 12 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. మర్నస్ లబూషేన్‌ (10) కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ప్రస్తుతం ఉస్మాన్‌ ఖ్వాజా, కెమరూన్‌ గ్రీన్‌ క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ పేసర్‌ షమార్‌ జోసఫ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

Exit mobile version