NTV Telugu Site icon

AUS vs SA: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా చెత్త రికార్డు!

Australia Bad Record

Australia Bad Record

Australia Lost Four Consecutive Matches in ODI World Cup history: ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ చాంపియన్ ఆస్ట్రేలియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అటల్‌ బిహారీ వాజపేయ ఏకానా స్టేడియంలో గురువారం దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆసీస్.. ఈ చెత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచకప్ 2023 ఫేవరెట్‌, పటిష్ట ఆస్ట్రేలియా ఇలా వరుసగా ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఏకపక్షంగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఏకంగా 134 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో విఫలమయిన ఆసీస్.. మూల్యం చెల్లించుకుంది. ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్‌లో భారత్‌తో చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక వన్డే ప్రపంచకప్‌‌ 2019లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో కూడా ఓటమిపాలైంది. దాంతో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది.

Also Read: Gold Price Today: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?

వన్డే ప్రపంచకప్ 2023లోనూ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. వరుసగా రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో ఓడిపోవడం సెమీస్ అవకాశాలను దెబ్బతీయనుంది. ఆసీస్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రన్‌రేట్ ( -1.846) నెగటీవ్‌లో ఉంది. దాంతో మెగా టోర్నీలో ఆసీస్ ముందడుగు వేయాలంటే.. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 6 గెలవాలి. అంతేకాదు మెరుగైన రన్‌రేట్‌ చాలా అవసరం. చూడాలి మరి ఆసీస్ పుంజుకుంటుందో లేదో.