AUS vs SA: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా చెత్త రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia Lost Four Consecutive Matches in ODI World Cup history: ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ చాంపియన్ ఆస్ట్రేలియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అటల్ బిహారీ వాజపేయ ఏకానా స్టేడియంలో గురువారం దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆసీస్.. ఈ చెత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచకప్ 2023 ఫేవరెట్, పటిష్ట ఆస్ట్రేలియా ఇలా వరుసగా ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఏకపక్షంగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఏకంగా 134 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో విఫలమయిన ఆసీస్.. మూల్యం చెల్లించుకుంది. ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్‌లో భారత్‌తో చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక వన్డే ప్రపంచకప్ 2019లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో కూడా ఓటమిపాలైంది. దాంతో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది.
Also Read
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
- ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
Also Read: Gold Price Today: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
వన్డే ప్రపంచకప్ 2023లోనూ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. వరుసగా రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో ఓడిపోవడం సెమీస్ అవకాశాలను దెబ్బతీయనుంది. ఆసీస్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రన్‌రేట్ ( -1.846) నెగటీవ్‌లో ఉంది. దాంతో మెగా టోర్నీలో ఆసీస్ ముందడుగు వేయాలంటే.. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 6 గెలవాలి. అంతేకాదు మెరుగైన రన్‌రేట్ చాలా అవసరం. చూడాలి మరి ఆసీస్ పుంజుకుంటుందో లేదో.
AUSTRALIA HAS LOST 4 CONSECUTIVE MATCHES IN WORLD CUP.
– First time in the 48 year old tournament history….!!!! pic.twitter.com/QmYF0R2ma7
— Johns. (@CricCrazyJohns) October 12, 2023
తాజావార్తలు
-
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
-
Team India-BCCI: టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Karthi New Movie: కార్తికి మరో భారీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్‌తో ఫస్ట్ టైమ్ .. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త సినిమా!
-
Kia Sorento: కియా సోరెంటో ఎస్యూవీ కొత్త టీజర్ విడుదల.. ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం, లాంచ్‌కు సిద్ధమైన కియా
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
ట్రెండింగ్
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!